ఇదెందయ్యా.. అక్కడ కూడా వంటలు చేస్తారా?

Satvika
మన కళ్ళను మనం నమ్మలేని నిజాలను ఒక్కోసారి మనం వింటాము.. కొందరికి అవి షాక్ ఇస్తే, మరికొంత మందిని ఆలోచనలో పడేస్తుంది. ఇప్పుడు వినే వార్త కూడా అలాంటిది. అందరినీ ఆశ్చర్యానికి గురిచెస్తుంది.. మాములుగా వంటలు చేసుకోవడానికి గ్యాస్ ను ఈ మధ్య ఎక్కువగా వాడతారు. ఒకప్పుడు కట్టెల పొయ్యి పై వంటలు చేసే వారు.. కొన్ని రకాల వంటలను చేయడానికి కొన్ని రెస్టారెంట్ లలో పొయ్యి లను వినియొగిస్తారు. అంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు చెప్పబోయేది వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏకంగా అగ్నిపర్వతం పై వంటలను చేస్తున్నారు..


ఇది నిజంగానే వింత అనే సందేహం అందరికి రావడం సహజం.. కానీ మీరు విన్నది నిజమే..అది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..అగ్ని పర్వతాన్ని స్టవ్‌ గా మార్చేసుకుని దానిపై వంట వండుతోంది. అదే స్పెయిన్ లోని టెగ్యూస్లో ఉన్న ఎల్ డయాబ్లోరెస్టారెంట్. ప్రత్యేకత..అగ్నిపర్వతం పై ఈ నగరాన్ని నిర్మించారు. ఈ పర్వతం ను ఒక స్టవ్ గా మార్చుకున్నారు. దానిపై ప్రత్యెకమైన వంటలను చేస్తున్నారు.ఆర్కిటెక్టులు అగ్నిపర్వతంపైన 9 పొరలుగా సున్నపు రాయిని వేసి, దానిపైన రెస్టారెంట్ ని నిర్మించారు. ఆ తర్వాత అగ్నిపర్వత కన్నంపైన చువ్వలతో ఓ పెద్ద గ్రిల్ ఏర్పాటుచేశారు.


ఆ లావా పొంగదు.. కానీ సెగ మాత్రమే వస్తుంది.దీన్ని స్టవ్ గా మార్చుకున్నారు. గ్రిల్ చెయాల్సిన వంటలను ఇందులో చేస్తారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటలను ఇందులో చేయడం ప్రత్యేకం.గ్రిల్ కి 6 అడుగుల కింద అగ్నిపర్వత లావా కుతకుతా ఉడుకుతూ ఉంటుంది. అది 400 డిగ్రీల వేడితో ఉంటుంది.. ఇది మాంసమ్ ఉడకడానికి మంచి వేడి. ఎప్పుడో 1800 సంవత్సరం లో ఒకసారి బద్దలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా అది బద్దలవ్వలేదు.. అందుకే ఈ రెస్టారెంట్ బిజినెస్ కూడా భారీగా సాగుతుంది... భలే ఐడియా కదా..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: