ఓరి నాయనో.. అగ్ని పర్వతం పై రెస్టారెంట్?
అయితే సాధారణంగా ఎవరైనా రెస్టారెంట్ మొదలు పెట్టాలి అనుకుంటే ఎలాంటి ఆలోచన చేస్తారు జనసందోహం ఎక్కువగా ఉండి ఇక అన్ని రకాల మౌలిక వసతులు కలిగి ఉన్న ప్రాంతాలలో రెస్టారెంట్ పెట్టాలి అని అనుకుంటారు. అలాంటి ప్లేస్లో హోటల్ పెడితే ఇక బిజినెస్లో తిరుగు ఉండదు అని భావిస్తూ ఉంటారు. కానీ అగ్ని పర్వతం దగ్గర ఎవరైనా హోటల్ పెట్టాలని అనుకుంటారా.. బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఆలోచన చేస్తారా అండి అని అంటారు ఎవరైనా.
కానీ ఇక్కడ కొంతమంది మాత్రం అగ్నిపర్వతం దగ్గర కాదు ఏకంగా అగ్నిపర్వతం పైన రెస్టారెంట్ పెట్టాడు. అగ్నిపర్వతం పేలితే జరిగే విధ్వంసం మాటల్లో చెప్పలేం. అలాంటిది ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏకంగా అగ్ని పర్వతం పైన రెస్టారెంట్ ఓపెన్ చేసి లావా వేడి తో వంటలు వండుతున్నారు.. స్పెయిన్లోని టెగ్యూస్ లో సరికొత్త రీతిలో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. దీనిని పునాదులు లేకుండా సున్నపురాయితో నిర్మించారు. ఈ రెస్టారెంట్లో తినడానికి పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతూ ఉండటం గమనార్హం. 1824లో ఒకసారి ఈ వాల్కనో బద్దలైంది. అప్పటి వరకు ఇక అగ్నిపర్వతం వరకు బద్దలు కాకపోవడం గమనార్హం. ఏదేమైనా ఎవరికీ రాని ఆలోచన వీళ్లకు వచ్చింది. ఊహించని రీతిలో అగ్ని పర్వతం పై రెస్టారెంట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు.