కుక్కలకు మానవ సాయం కావాలంటే.. ఇలాగే ప్రవర్తిస్తాయంట..!

MOHAN BABU
 ప్రపంచ దేశాలలో పెంపుడు జంతువులలో శునకాలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ఇందులో భాగంగానే  శునకాలను పెంచుకుంటే ఎంతో విశ్వాసంతో ఉంటాయి. వాటికి చాలా మెమొరీ పవర్ కూడా ఉంటుంది. అందుకే పోలీస్ వ్యవస్థ లో కుక్కలను  ఎక్కువగా నేరాలను పట్టుకోవడంలో ఉపయోగిస్తారు. కాబట్టి శునకాలు  కూడా కొన్ని అలవాట్లను కలిగి ఉంటాయి. అందుకే శునకాలను పెంచుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు అయినా పెడతారు. వీటికోసం చాలామంది కోర్టుల మెట్లు  కూడా ఎక్కిన సంఘటనలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా..!
ఆహారం అందుబాటులో లేనిచోట కుక్కలు తమ యజమాని, ఆహారం పట్ల భిన్నంగా ఎలా ప్రవర్తిస్తాయి తెలుసుకోవడంతో పాటు కుక్కల స్వరాల శబ్ద కూర్పును వర్గీకరించడమే ప్రస్తుత అధ్యయన లక్ష్యం. మా అధ్యాయనంలో మొరిగే బహుళ కుక్కల మధ్య కొన్ని స్వర సారూప్యతలను కనుగొన్నాం అని అధ్యయన బృందం తెలియజేసింది. సంఘటనలు కూడా ఉన్నాయి

కుక్కలు నిస్సహాయంగా ఉన్నప్పుడు మానవ సాయాన్ని కోరుకుంటాయని ఈ అధ్యయనం రుజువు చేసింది.శూనకాల ముందు ప్లేట్ ఆహారం ఉంచినప్పుడు ఎలా ప్రవర్తిస్తాయి. అదే విధంగా ఆహారం అందుబాటులో లేనప్పుడు ఎలా స్పందిస్తాయో తెలుసుకునేందుకు 51 కుక్కలతో ఫ్రాన్స్ చెందిన  AixMarseille విశ్వవిద్యాలయ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఓ ప్రయోగం చేసింది. ఇందులో భాగంగా అమెరికన్ స్టాఫోర్డ్ షైర్ టెర్రియర్, లాబ్రడార్స్, గోల్డెన్ రిట్రీవర్స్, స్నాజర్ వంటి శూనక జాతుల్ని ప్రయోగానికి ఎంచుకుంది. ఈ మేరకు కుక్క పిల్లలను ఒక గదిలోకి తీసుకెళ్లి, ఆహారమున్న ప్లేట్ పట్టుకొని దాని ముందు ఉండగా వాటిలో ఎలాంటి స్పందన లేకపోగా, ఆ గదిలోకి కుక్క పిల్లల యజమానులు ప్రవేశించిన వెంటనే వాటి ప్రవర్తనలో, స్వరంలో వచ్చిన తీవ్ర మార్పులను పరిశోధకులు గమనించారు. దాదాపు 22 శాతం కుక్కలు గొంతు చించుకోగా,32 శాతం కుక్కలు అరుపులతో సరి పెట్టుకున్నాయి. ఇక మిగిలిన 68 శాతం మాత్రం మొరిగినట్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: