బాతు వయ్యారి నడక.. నెట్టింట వైరల్..

Purushottham Vinay
ఇక సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ కూడా అసలు ఎన్నో రకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా కామెడీగా ఉంటే మరికొన్ని మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.అయితే ఈ వైరల్ అయ్యే వీడియోల్లో మాత్రం ఎక్కువగా జంతువులు, పక్షులు ఇంకా పాములకు సంబంధించినవి ఉంటాయి. తాజాగా.. ఓ బాతుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే.. బాతు (Duck) ఆరోగ్యంపై దృష్టి పెట్టి తెగ వ్యాయామం చేస్తుంది. బాతు.. ఏంటీ..? ఇలా వ్యాయామం చేయడం ఏంటీ అని అనుకుంటున్నారు.. కదా..? అవునండి ఈ బాతు ఫుల్ గా తన ఫిట్నెస్‌పై దృష్టి పెట్టింది. ఇప్పుడు ఈ హంస వీడియో (Viral Video) చూసి అందరు కూడా ఆశ్చర్యంthoముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే.. ఫిట్నెస్‌పై ఈ బాతుకున్న అవగాహన.. మనకు కొంచెం ఉన్న చాలంటున్నారు నెటిజన్లు. ఇక ఈ హంస వీడియో చాలా క్యూట్‌గా ఉందంటూ సోషల్ మీడియాలో వీక్షకులు తెగ మైమరిచిపోతున్నారు.


ఇక సాధారణంగా.. బాతులు ఇంకా అలాగే హంసలను వాటర్‌ఫౌల్స్ అని పిలుస్తారు.. ఎందుకంటే అవి ఎప్పుడు సాధారణంగా చిత్తడి నేలలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు ఇంకా నీరు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. అయితే..ఈ వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం బాతు ట్రెడ్‌మిల్‌ దగ్గర కనిపిస్తుంది.సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతన్న ఈ 14 సెకన్ల వీడియోలో.. బాతు నడుస్తున్న ట్రెడ్‌మిల్ దగ్గర నిలబడి నెమ్మదిగా దాని పైకి ఎక్కి క్యూట్ గా జాగింగ్ చేయడం కనిపిస్తుంది. నెమ్మదిగా ట్రెడ్‌మిల్ ఎక్కి ఆ బాతు.. దెబ్బకు పరుగులు తీస్తుంది.ఇక ఇంకెందుకు ఆలస్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బాతు వైరల్ వీడియోను మీరు కూడా చూడండి..సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు బాగా ఫిదా అవుతున్నారు. ఈ బాతు చాలా క్యూట్‌గా ఉందంటూ కొందరు పేర్కొంటుంటే.. మరికొందరు మాత్రం బాతును ఫిట్‌నెస్ ఫ్రీక్ అంటూ దాన్ని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఎక్కడిది అనేది మాత్రం ఇంకా తెలియనప్పటికీ ఈ వీడియో చూస్తున్న వారు మాత్రం  తెగ మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: