అయ్యో పాపం.. రిషెప్షన్ లో కుప్ప కూలిపోయిన పెళ్ళి కూతురు..

Satvika
మనిషి జీవితం ఎప్పుడూ ఎలా వుంటుందో మనం ఊహించగలిగేది కాదు.. ఇప్పుడు వున్న మనుషులు కనురెప్ప కాలంలో ప్రానాలను పొగొట్టుకున్నారు.. ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చుస్తున్నాయి. వైద్యులను కూడా షాక్ కు గురి చేసే ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ఇప్పుడు కూడా అలాంటి ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకున్న ఓ పెళ్ళి కూతురు పెళ్ళి చేసుకుంది. అక్కడ వరకూ బాగానే వుంది. కానీ, రిషెప్షన్ లో మాత్రం అందరికి షాక్ ఇచ్చింది. 

వివరాల్లొకి వెళితే.. కర్ణాటకలో ఒక వింత ఘటన వెలుగు చూసింది..



కర్నాటకలోని శ్రీనివాసపురంకు చెందిన రామప్పకు చైత్ర అనే కుమార్తె ఉంది. తాను కైవార కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుంది. హోసకోటకు చెందిన ఓ వ్యక్తితో చైత్రకు వివాహం ఖాయం అయ్యింది. అది కాస్త బాగానే జరిగింది.. బంధువుల తో ఆమె వివాహం చాలా సంతోషంగా గడిపింది. అంతా బాగానే వున్నా కూడా దేవుడు ఆమె జీవితం పై చిన్న చూపు చూసింది. రిసెప్షన్ లో ఒక్కసారి కుప్ప కూలిపోయింది. అది చూసిన బంధువులు మొత్తం ఒక్కసారిగా అవాక్కయ్యారు.



చైత్రకు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అందుకే ఆమెను వెంటనే బెంగుళూరు నిమ్హాన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరు రోజులు చైత్రను పరీక్షించిన తర్వాత చైత్ర బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. వైద్యులు చెప్పడంతో చైత్ర అవయవాలు దానం చేయడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఆమె భర్త కూడా అందుకు ఒప్పుకున్నాడు.. తమ అమ్మాయి వేరే వారిలో అయిన బ్రతికి ఉంటుంది అంటూ భాధను వ్యక్తం చేశారు. ఈ ఘటన నిజంగానే అందరినీ ఇబ్బందులకు గురి చేసింది.. పాపం మరోకరి తో మూడుముళ్ళు పడ్డాయి అనుకునే లోపు ఇలా జరగడం అందరికి మింగుడు పడలేదు.. నిజంగా ఇది ఎవ్వరికి రాకూడదని చెప్పాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: