60 యేళ్ళ రోజూ వారి కూలీ..ఇప్పుడు సూపర్ మోడల్..వీడియో వైరల్..!!

Divya
సాధారణంగా ఎవరైనా సరే ఎప్పుడు ఎలా మారుతారో చెప్పడం చాలా కష్టం.. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే అదృష్టం అంటే ఇలానే ఉంటుందేమో అని అందరూ అనుకోక తప్పదు. ఇక జీవితంలో ఉన్నతస్థానానికి ఎదగాలంటే కొంచెం అదృష్టం కూడా ఉండాలి. ఎంతమంది ఎంత కష్టపడినా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగలేరు.. కానీ ఆ కష్టానికి కొద్దిగా అదృష్టం తోడైతే ఇక వారిని ఎవరు కూడా అందుకోలేరు అని చెప్పవచ్చు.
కొంతమంది జీవితాలలో ఏదో అదృష్టం అలా వచ్చినట్టుగా వారిని బలవంతులని చేస్తూ ఉంటుంది.. ఇకపోతే తాజాగా జరిగిన ఒక సంఘటన చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే.. కేరళలోని కోజికోడ్ లో నివసిస్తున్న మమ్మిక్క అనే 60 యేళ్ళ ఒక రోజు వారి కూలీ.. అనుకోకుండా కొద్దిరోజుల్లోనే చాలా ఫేమస్ అయిపోయాడు.. అతడిపై ఒక ఫోటోగ్రాఫర్ కన్నుపడటంతో రాత్రికి రాత్రే మోడల్ గా మారిపోయాడు ఆ కూలీ.. గ్లామరస్ లుక్ తో ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాడు ఈయన.
మమ్మిక్క తాజా ఫోటో షూట్ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ.. అందరి దృష్టిని ఆయన వైపే మళ్ళీస్తోంది. అంతేకాదు ఈ వీడియోలో అతడి స్టైలు కి అందరూ చాలా మంది మంత్రముగ్ధుల్ని అవుతున్నారు.. ఇటీవల స్థానిక సంస్థల ప్రమోషన్ కోసం మమ్మీక్క ఈ ఫోటో షూట్ చేశాడట. ఇందులో అతను విలాసవంతమైన సూట్ లో చేతిలో ఐ ప్యాడ్ పట్టుకుని మనకు కనిపిస్తాడు.. ఒక ఫోటోగ్రాఫర్ షారీక్ దినసరి కూలీ ని సూపర్ మోడల్ గా మార్చి సోషల్ మీడియాలో ఇతడి ఫోటోల ద్వారా సంచలనం సృష్టిస్తున్నాడు.

తాజాగా ఫోటోగ్రాఫర్ షారిక్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం ఆశిక్ ఫువాధ్, షబీబ్ వాయిల్ అనే ఇద్దరు అసిస్టెంట్లు ఇతడిని అలా మార్చారు.. మమ్మిక్క ఫోటో షూట్  చూస్తే నటుడు వినాయక్ తో సమానంగా ఉంటుందని అందరూ ఇతడిని పొగడ్తలతో ముంచెత్తారు.. అంతే కాదు నాడు  కూలీ.. నేడు సూపర్ మోడల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: