భీమ్లా నాయక్ : టికెట్ కోసం బాలుడు మృతి..!!

Divya
ఈ మధ్యకాలంలో అభిమానులు ఎంతలా మారిపోయారు అంటే సినిమాకు సంబంధించి అప్డేట్ మొదలైనప్పటి నుంచి విడుదలయ్యే వరకు ఏదో ఒక టెన్షన్ లో ఉంటున్నారు. సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ విడుదల చేయకపోయినా అభిమానులలో అసహనం మొదలయ్యి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.. ఇప్పుడు చెప్పే ఒక 11 యేళ్ళ బాలుడు ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు.. భీమ్లా నాయక్ సినిమా చూడడానికి తన తండ్రి తనకు డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం అందరినీ తీవ్ర దుఃఖంలో ముంచేసింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల లోని  పురానీపేట లో 11 సంవత్సరాల నవదీప్ అనే బాలుడు తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు.. ఇక ఈ అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు.. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన పిచ్చి.. హీరో నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల అవుతూ ఉండడంతో తొలి రోజు తొలి ఆటనే చూడాలని భావించాడు. ఇక ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలని అనుకున్నాడు.. ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ ఓపెన్ చేశారు అని తన స్నేహితుడు చెప్పడంతో ఇక సినిమా టికెట్ కొనాలి అంటే 300 రూపాయలు కావాలి అందుకు తండ్రిని అడిగాడు..

దినసరి కూలీ చేసుకునే ఆయన దగ్గర డబ్బులు లేవని.. కొంత సమయం ఇవ్వమని కుమారుడికి నచ్చ చెప్పాడట. దీంతో మనస్తాపం చెందిన నవదీప్ గదిలోకి వెళ్లి లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది.. ఇకపోతే తండ్రి మాట్లాడుతూ.. ఏదో భీమ్లా నాయక్ సినిమా అంట.. టికెట్ కోసం రూ. 300 అడిగిండు.. నా దగ్గర పైసలు లేవు.. కానీ రూ.150 వేరేవాళ్లు ఇవ్వాలి.. మీరు ఇంకో రూ.150 ఇవ్వండి అని చెప్పిండు.. కూలి పని చేసుకునే వాళ్ళు ఒకేసారి అంత మొత్తం అంటే నా దగ్గర డబ్బులు లేవు.. కానీ ఒకరోజు ఆగమని చెప్పాను.. ఇక నువ్వు ఎప్పుడు పైసలు ఇయ్యవు నాకు అనుకుంటూ కోపంతో గది లోకి వెళ్లి తలుపు గొళ్ళెం పెట్టుకున్నాడు.. ఎంతసేపటికి బయటకి రాకపొయేసరికి తలుపులు బద్దలు కొట్టి పోయి చూసే సరికి అంతా అయిపోయింది నా కొడుకు గిట్ల చేస్తాడు అని అనుకోలేదు అంటూ ఆ తండ్రి గుండెలవిసేలా రోదించడం బాధాకరం అనిపించింది.

ఒక సినిమా కోసం బాలుడు తన బంగారు భవిష్యత్తు అర్ధాంతరంగా ముగించుకోవడం తో గ్రామస్తులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇదంతా సినిమా కోసమే నా .. లేక ఏదైనా కారణం ఉందా ..అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: