పేదవాడే కానీ దానంలో ధనవంతుడు..

Purushottham Vinay
ఈ కాలంలో మనుషులు అంతా స్వార్ధపరులు.ఎవరి కడుపునైనా కొట్టాలని చూస్తారు కాని నింపాలని చూడరు. ఇక సాయం విషయానికి వస్తే...మాకే డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే మేము ఏం సహాయం చేస్తామని వాగుతుంటారు.సాధారణంగా ఎవరికైనా సాయం చేయాలంటే అది కేవలం డబ్బులున్న వారు మాత్రమే చేస్తారు.ఈరోజుల్లో డబ్బున్న ఎవరు ఏమి చెయ్యట్లేదు అనుకోండి. ఏదో పబ్లిసిటీ కోసం కవరేజ్ కోసం అలా దానం చేస్తున్నట్టు పోజులు కొడతారు కాని నిజం ఏంటో ఆ పైవాడికే తెలుసు.
అయితే ఎదుటి వారికి సాయం చేయాలంటే డబ్బుతో పని లేదని, కేవలం మంచి మనసు ఉంటే చాలని చాటి చెప్పాడు ఓ పెద్దాయన. తన ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కానీ .. మూగ జీవులపై అతను చూపిన ప్రేమ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఒక పెద్దాయనకు ఆకలితో తిరుగుతోన్న ఓ వీధి కుక్క కనిపించింది. దీంతో అతను సైకిల్‌ తీసుకొచ్చిన అన్నాన్ని ఆ కుక్కకు పెట్టాడు. ఎంతో ఆకలితో ఉన్న ఆ కుక్క కడుపునిండా లాగించేసింది. ఆ సమయంలో ఆ పెద్దాయన కళ్లల్లో కనిపించిన సంతోషం ఎన్ని డబ్బులు పెట్టిన కాని దొరకదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు.పేదవాడే కానీ దానంలో ధనవంతుడు.
దీనంతటినీ కూడా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ కూడా ఆ పెద్దాయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సహాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు, మంచి మనసు అంటూ వారు కామెంట్లు చేస్తున్నారు.ఈ పేద తాత డబ్బు లేనోడే కాని దానంలో అందరి కంటే ధనవంతుడు అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: