సోషల్ మీడియా అతని జీవితాన్నే మార్చెసింది?

Satvika
ఇప్పుడు ప్రతిదీ సోషల్ మీడియాలో చిటికెలో తెలిసి పోతుంది. అందుకే చాలా మంది సోషల్ మీడియాకు ఫ్యాన్ అయిపోయారు. అయితే ఇక్కడ కొంత మంది జీవిథాలను బయట పెడితే మరి కొంత మందికి కొత్త జీవితాన్ని ఇస్తుంది. సోషల్ మీడియా అధారంగా చాలామంది డబ్బులను సంపాదిస్తున్నారు. మానవ జీవితం ఎప్పుడూ ఎలా వుంటుందో ఎవరూ ఊహించలెరు. గతంలో మనం చేసుకున్న పాప పుణ్యాల ఫలితం ఈ జన్మలో మన దశను మారుస్తుంది.


నిమిషాల్లో ఒడలు బండ్లు అవ్వొచ్చు.. బండ్లు ఓడలు అవ్వొచ్చు..అది విధి రాసిన రాత దానిని ఎవరూ తప్పించుకోలేరు.. ఆ సామెతకు సరిగ్గా సరిపోయేలా ఇప్పుడు ఒక ముసలాయన జీవితం పూర్తిగా మారిపొయింది.. అతను నిజానికి ఒక కూలి అయితే అందరికి షాక్ ఇచ్చేలా అతను ఇప్పుడు పెద్ద మోడల్ అయ్యాడు. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. అది కూడా సోషల్‌మీడియా స్టార్ గా మారాడు.. ఇది విన్న వాళ్ళు ఎవరూ నమ్మక పోవచ్చు.. అతను ఎవరూ, ప్రస్తుతం అతని జీవిత విషెసాల గురించి వివరంగా తెలుస్తుంది.


వివరాల్లొకి వెళితే..కేరళలోని కోజికోడ్ జిల్లా కొడివల్లికి చెందిన 60 ఏళ్ల మమ్మిక్కా అనే వ్యక్తి రోజువారీ కూలి రెక్కాడితేగాని డొక్కాడని బ్రతుకు అతనిది.. రోజు రెండు చేతులతో పని చెస్తె కానీ అతనికి నాలుగు వెళ్ళు నోటిలోకి వెళ్లవు. షర్ట్ వేసుకొని, లుంగీ కట్టుకొని అదే ప్రాంతంలో తిరిగే ఓ సర్వ సాదారణ వ్యక్తి.. అతని ప్రెజెంట్ ట్రెండ్ లుక్ వచ్చి అందరికి షాక్.ఇస్తుంది. ఆ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫెమస్ అవుతూన్నాయి.తనను మోడల్‌గా పెట్టి కేరళకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ కొత్త ఫోటోలను తీసాడు. 60 ఏళ్ల మమ్మిక సూపర్ గ్లామ్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.. ఎలా ఉన్న అతను ఎలా మారాడు అనేది మీరు కూడా ఒకసారి చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: