పెళ్ళి అంటే ఎన్నో సరదాలు, ముచ్చటలు మరెన్నో ఒక వేడుక లో కనిపిస్తాయి. అందుకే పెళ్ళిని అందరు సరదాగా చేసుకుంటూన్నారు. అయిథె కొన్ని పెళ్ళిళ్ళు సరదాగా వుంటే మరి కొన్ని ఫన్నీగా వుంటాయి.ఈ మధ్య పెళ్ళికి సంబంధించిన ఎన్నో ఫన్నీ వీడియోలను సోషల్ మిడీయాలో చూస్తూనే ఉంటాము. అందులో కొన్ని వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి చక్కర్లు కోడుతుంది.. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుకు షాక్ ఇచ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చెస్తుంది.. మొన్న ఒక పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకును భయ పెట్టిన ఘటన కలకలం రెపింది. ఇప్పుడు ఈ వీడియో కూడా ఎ మాత్రం తగ్గలేదు..
మన దేశంలో జరిగే అన్నీ పెళ్ళిళ్ళు చాలా, సరదాగా, సంతోషంగా బంధుమిత్రుల మధ్య ఘనంగా చెసుకుంటారు..జీవితంలో ఒకసారి జరిగే ఈ పెళ్ళి పై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాగా, పెళ్లి సమయంలో వధూవరులు ఇద్దరు ఎంతో సంతోషంగా.. అన్యోన్యంగా కనిపిస్తారు. అంతేకాకుండా , ఒకవైపు పెళ్ళి జరుగుతున్న కూడా ఆ సమయంలో వధువరులు చేసే అల్లరి, బంధుమిత్రుల ఆటపాటలతో ఎంతో సందడి వాతావరణం మారిపోయింది. ఇలాంటి ఆనందక్షణాలను కెమెరాలో బంధిస్తుంటారు. ఇటీవల పెళ్ళిళ్ల ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా ఫెమస్ అవుతూన్నాయొ చెప్పాల్సిన పనిలేదు. అందులో పెళ్లి వేడుకలో ఆకస్మాత్తుగా జరిగే ఘటనలు కొన్ని అందరినీ నవ్విస్తాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మాత్రం.. వాళ్లిద్దరికి ఏమైంది అనేలాగే ఉందండి. అసలు అంత ఆశ్చర్యం కలిగించే అంశం ఏముంది అనేది ఆ వీడియో లో తెలుసుకుందాం..
ఆ వీడియోలో బంధుమిత్రుల మధ్య వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది..అప్పుడు ఆ వధూవరులిద్దరూ వరమాల వేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొవాలని కొరగా బంధువులు వారిద్దరు ఆ పనిలో ఉన్నారు. అప్పుడు వరుడు రసగుల్లాను తీసుకుని వధువు నోటికి అందించారు. దానిని అందుకున్న ఆమె దానిని తీసుకుని కోపంతో బయటకు పడేసింది. కాగా, ఇప్పుడు వధువు వరుడికి నీళ్లు తాగించే ఆచారం రావడంతో.. ఆమె అతనికి నీళ్ల గ్లాసు అందించగా.. అతడు తీసుకోలేదు.దాంతో కోపంతో వధువు ఆ నీళ్ల గాసును విసిరి కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై రకరకాల కామెంట్లు కూడా అందుతున్నాయి..