బాలుడుకి ఝలక్ ఇచ్చిన తల్లి.. ఎందుకో తెలుసా?

Satvika
ఈరోజుల్లో సోషల్ మీడియా మీద జనాలు ఎంతగా ఆధారపడ్డారో ప్రత్యెకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి చిన్న విషయం అయిన క్షణాల్లో తెలిసిపోతుంది.. అందుకే సెకన్లలో వార్తలు అందరికి తెలుస్తుంది.  అయితే కొంతమంది మంచి కోసం వాడితే మరి కొంత మంది మాత్రం చెడు కార్యక్రమాల కోసం వాడుతున్నారు. అయితే చిన్న సోషల్ మీడియాను చిన్న పిల్లలు ఎక్కువగా వాడుతూ తప్పు ద్రొవ పడుతున్నారు.. ఈ విషయాన్ని తల్లి దండ్రులు చాలాసార్లు బయట పెట్టారు.


ఇప్పుడు కొడుకుని సోషల్ మీడియాకు దూరం పెట్టాలని సరికొత్త నిర్ణయం తీసుకుంది. అది ఇప్పుడు హల్ చల్ చెస్తుంది. అతను సోషల్ మీడియాకు ఆరు నెలలు దూరంగా వుంటే అతనికి అడిగిన డబ్బులను ఇస్తానని పందెం కాసింది. అవును మీరు విన్నది అక్షరాల నిజం. తల్లి చెప్పిన పని చెస్తె భారీగా డబ్బులు వస్తాయని అనుకున్నాడు..వివరాల్లొకి వెళితే..మిన్నెసోటాలో తల్లి లోర్నా గోల్డ్ స్ట్రాండ్ 13 ఏళ్ల పిల్లగాడు సివెర్ట్ క్లెఫ్ సాస్ తో కలిసి ఉంటున్నారు. వారు ఎప్పుడూ కలిసి బయటకు వెళ్ళడం చెస్తున్నారు. ఎక్కడకు వెళ్ళినా కూడా సీవెర్ట్ సెల్ ఫోన్ విపరీతంగా వాడేవాడు. నిమిషం కూడా తీరిక లేకుండా సోషల్ మీడియాను వాడుతూ ఎక్కువ సమయం అందులోనే గడిపే వాడు.


ఈ విషయాన్ని తల్లి గమనించింది. అలా చెయొద్దని ఎంత వారించిన కూడా అతడు వినలేదు..దూరంగా ఉండాలని చెప్పింది. కానీ ఆ పిల్లాడు తల్లి చెప్పిన మాటలను వినిపించుకోలేదు. చివరకు ఓ ఐడియా వచ్చింది. కొడుక్కి ఓ ఛాలెంజ్ విసిరింది. ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే.. 18వ పుట్టిన రోజున 1,800 డాలర్లు డబ్బులు ఇస్తానని ఛాలెంజ్ విసిరింది. డబ్బులు ఎక్కువగా వస్తున్నాయని ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. ఆరేళ్లు గడిచిపోయాయి. అన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు.తాజాగా 18వ పుట్టిన రోజును చేసుకున్నాడు.. ఛాలెంజ్ ప్రకారం రూ. 1800 డాలర్లు కొడుక్కి ఇచ్చింది. కొడుకు ఫొటోను సోషల్ మీడియాలొ షేర్ చేసింది. సోషల్ మీడియాకు బానిస కావొద్దని తన ఉదాహరణగా చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: