బుల్లెట్ బండి పాట పై వెయ్యి మంది డాన్స్.. వైరల్ వీడియో?

praveen
బుల్లెట్ బండి పాట ఎంతలా సెన్సేషన్ సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట అన్ని పాటలు లాగానే ఒక సాదా సీదా పల్లె పాట గా ఈ పాట సోషల్ మీడియా లో విడుదలైంది. కానీ ఆ తర్వాత ఒక పెళ్లి భరాత్లో పెళ్లికూతురు బుల్లెట్ బండి పాట పై డాన్స్ చేసి వరుడికి సర్ప్రైస్ ఇవ్వడంతో ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఒకరకంగా బుల్లెట్ బండి పాట ఊహించని రేంజిలో క్రేజ్ సంపాదించడానికి ఆ కొత్త పెళ్లి కూతురే కారణం అని చెప్పాలి.


 ఇక ఆ తర్వాత అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. ఎక్కడ బడితే అక్కడ బుల్లెట్ బండి పాట వినిపించడం మొదలైంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ బుల్లెట్ బండి పాట పై డాన్స్ చేయడం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి కూడా చేశారు. అంతేకాదు ఇక పెళ్లి జరిగింది అంటే చాలు భారత్లో పెళ్లికూతురు బుల్లెట్ బండి పాట పై డాన్స్ చేయడం ఒక ట్రెండ్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక అటు యూట్యూబ్ లో కూడా ఈ బుల్లెట్ బండి పాట ఊహించని రీతిలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అయితే ఇప్పటి వరకూ  ఒకరు లేదా ఇద్దరు లేదా పదిమంది కలిసి బుల్లెట్ బండి పాట పై డాన్స్ చేయడం చూశాం.


 కానీ ఇప్పుడు మాత్రం పదిమంది 20 మంది కాదు ఏకంగా వెయ్యి మంది ఒకేసారి బుల్లెట్ బండి పాట పై కాలు కదిపి స్టెప్పులేశారు. జగిత్యాల మినీ స్టేడియంలో ఇక ఈ కార్యక్రమం జరిగింది. వెయ్యి మంది చిన్నారులు మహిళలు యువకులు అందరూ కలిసి బుల్లెట్ బండి పాట పై డాన్స్ చేసి అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇలా బుల్లెట్ బండి పాట పై ఒకేసారి వెయ్యిమంది స్టెప్పులేయడం తో ఇక ఇది కాస్త ఇంటర్నేషనల్ వండర్  బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: