షాక్: పాము కాటుకు గురైన విద్యార్థులు..!!

Divya
విజయనగరం జిల్లాకు చెందిన కురూపంలోని మహాత్మా జ్యోతిబాపూలే లో ఉన్న బీసీ గురుకుల పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటు వేసిన ఘటన చోటు చేసుకుంది. ఆ పాఠశాలకు సంబంధించిన హాస్టల్ లో విద్యార్థులు నిద్ర పోతూ ఉండగా ఈ విషాదం చోటు చేసుకున్నది. ఈ పాము కాటువల్ల ముగ్గురు విద్యార్థులలో ఒకరు మృతి చెందారు. మరొక ఇద్దరు పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విద్యార్థులను పాముకాటు వేసినట్లుగా అక్కడ గమనించిన సిబ్బంది కూడా హుటా హుటిన ఆ విద్యార్థులను పార్వతీపురం ప్రాంతంలో ఉండే ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత అక్కడి నుంచి విజయనగరంలోనే తిరుమల ఆస్పత్రికి ఆ విద్యార్థులను తీసుకువెళ్లారు. ఇక అక్కడ చికిత్స చేయిస్తూ ఉండడంతో అక్కడ ఒక విద్యార్థి మరణించినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ తో మాట్లాడినట్లు గా సమాచారం. ఇక మృతి చెందిన విద్యార్థి పేరు రంజిత్ గా గుర్తించారు. ఈ పాము కాటుకు గురైన విద్యార్థులు అందరు 8 వ తరగతి చదువుతున్నారు. ఇక ఇందులో రంజిత్, ఈదుబుల్లి వంశీ, వంగపండు నవీన్ గా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరిలో ఇద్దరు మాత్రమే చికిత్స తీసుకుంటున్నట్లు గా తెలుస్తోంది. ఇందులో ఒకరు వెంటిలేటర్ పై ఉండగా, మరొకరి పరిస్థితి మాత్రం నిలకడగానే ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు.
ఈ సంఘటన తెలిసిన వెంటనే అక్కడికి జాయింట్ కలెక్టర్, డాక్టర్ మహేష్ ఆసుపత్రికి హుటాహుటిగా వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ విద్యార్థులు పాముకాటుకు గురైన విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ C.M. శ్రీ పుష్ప వాణి అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నది. ఆ వెంటనే ఆమె నేరుగా ఆస్పత్రి వద్దకు చేరుకొని విద్యార్థులను పరామర్శించినది. విద్యార్థులను ఎక్కడ ఎక్కడ భాగాలలో పాము కరిసిందో ఆమె పరిశీలించినది. విద్యార్థులకు ముక్కుపైన, వీపు పైన, కళ్ళ మీద పాము కరిచినట్లుగా సిబ్బంది తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: