పాము కాటుకి గురైన విద్యార్థి కుటుంబానికి సహాయం..!!

Divya
నిన్నటి రోజున విజయనగరం జిల్లాలో కురుపాం లోని మహాత్మ జ్యోతిబాపూలేలో ఉన్న గురుకుల పాఠశాలలో నిన్నటి రోజున పాముకాటుకు కొంతమంది విద్యార్థులు గురికావడం జరిగింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి కొన్ని విషయాలను తెలియజేసింది ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి.. ఇక ఈమె తో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడడం జరిగింది. ఈ ఘోరమైన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందడం కూడా జరిగింది. వీరితో పాటే మరొక ఇద్దరు విద్యార్థులు కూడా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు గా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకోవడం కోసం స్వయంగా మంత్రులు కూడా వెళ్లారు.

అయితే ఈ విద్యార్థి మృతి పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సహాయాన్ని ప్రకటించారు. మృతి చెందిన రంజిత్ కుటుంబానికి.. రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. ఇక ఆ ప్రాంత మంత్రుల ద్వారా ఈ రోజున విద్యార్థి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు గా సమాచారం. ఇక అక్కడ జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆ విద్యార్థి కుటుంబానికి కాస్త ఊరట లభించింది అని చెప్పవచ్చు. ఈ విషయంపై జగన్ తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నారు.

మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో గురువారం రోజున రాత్రి పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. భోజనం చేసిన తరువాత విద్యార్థులు అందరూ నిద్రిస్తున్న గదిలోకి అర్ధరాత్రి సమయంలో పాము ప్రవేశించడం జరిగిందట. కొమరాడ మండలం ఈ పేటకు చెందిన రంజిత్, వంగపండు నవీన్, ఈదుబల్లి  వంశీ లను కాటు వేయడం జరిగింది.. ఇక్కడ దగ్గరలో ఉండే హాస్పటల్ కి తరలించే మార్గమధ్యంలో రంజిత్ మరణించడం జరిగింది. ఇక మిగిలిన ఇద్దరు విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం వేరొక హాస్పిటల్ కి తరలించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: