భక్తుడి పై చేయి చేసుకున్న పూజారి..!!
ఉప్పల్ బాలాజీ హిల్స్ కు చెందిన.. వాల్మీకి రావు సికింద్రాబాదులోని గణేష్ గుడి కి రావడం జరిగిందట. ఆ పక్కనే ఉన్న కొన్ని ఆలయాలను కూడా దర్శించుకోవడం జరిగింది. ఇక ఆ సమయంలోనే.. అక్కడికి వచ్చిన ప్రభాకర్ శర్మ అనుమతి లేకుండా ఆలయం లోకి ఎలా ప్రయత్నిస్తామని ప్రశ్నించడం జరిగిందట. ఇక అంతే కాకుండా దీంతో భక్తుడి పై నోరు కూడా చేయడం జరిగింది. దీంతో వాల్మీకి రావు కు, ప్రభాకర్ శర్మ కు మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అది కాస్త ఎక్కువ అవ్వడంతో ఆగ్రహానికి లోనైన ప్రభాకర్ శర్మ.. అక్కడికి వచ్చిన భక్తుడు వాల్మీకి రావు పై దాడి చేయడం జరిగింది. ఇక అంతే కాకుండా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరించినట్లు గా సమాచారం. ఇదంతా కేవలం సిసి కెమెరాలో రికార్డ్ అయినది.
ఈ విషయంపై వాల్మీకి గోపాలపురం వద్ద ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఆ గుడికి వెళ్లే సీసీ కెమెరా ఫుటేజీలను దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది. దీంతో కొంత మంది భక్తులు పూజారి ప్రభాకర్ శర్మ పై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది భక్తులకు ఎలాంటి చేయడం తప్పు అని అంటున్నారు.