వామ్మో: పోలీస్ స్టేషన్ లో శాంతి పూజలు.. కారణం ఏమిటంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.. అదేమిటంటే పోలీస్ స్టేషన్ లో శాంతి పూజలు చేయడం తో ఈ విషయం తెలిసిన ప్రజలు, అధికారులు సైతం చాలా ఆశ్చర్య పోతున్నారు. ఇటీవల కాలంలో అన్ని అపశకునాలు వెంటాడుతున్నాయని.. అందుకే స్టేషన్ లో పూజలు నిర్వహించామని అధికారులు చెప్పినట్లుగా సమాచారం. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజమే. దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఈ విషయంపై అంతటా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.


ఆళ్లగడ్డ పట్టణంలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్లు ఈ రోజున అర్చకులతో si గోమూత్రము చెల్లించి విశేష పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని వారాల నుంచి ఎన్నో కేసులు రావడంతో పోలీస్ అధికారులు చాలా ఇబ్బంది పడుతుండడంతో గ్రహించిన అధికారులు అందరూ కలుసుకొని ఇలాంటి పని చేపట్టారు. ఇక అంతే కాకుండా గత శుక్రవారం రోజున అదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న టువంటి ఒక ఒక కానిస్టేబుల్ అధికారి పాముకాటుకి గురయ్యారు.

దీంతో ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలకు గురైనట్లుగా సమాచారం. ఇక ఈ సంఘటనలన్నింటినీ గమనించిన తరువాత శాంతి పూజలు చేస్తే ఈ సమస్యలు తొలగిపోతాయని కొంతమంది చెప్పడం తో పోలీస్ అధికారులు శాంతి పూజలు నిర్వహించామని తెలియజేశారు. అయితే ఈ పూజలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయంపై పై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో కూడా చూడాలి. రక్షించాల్సిన పోలీసులే ఇలా పూజలు చేస్తే ఎలా అని మరి కొంతమంది ఈ విషయం తెలిసిన తరువాత కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయం ఇంకా ఎంత వరకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: