ప్రపంచంలోనే పొడవైన కార్.. ఎంత పెద్దదో తెలుసా?
ఇక ఇప్పుడు సరికొత్త గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ అయ్యింది. అయితే ఈ రికార్డు క్రియేట్ చేసింది మనిషి కాదు ఏకంగా మనిషి అవసరాలు తీర్చే ఒక కారు. కారు గిన్నిస్ బుక్ రికార్డు కొట్టడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. ఈ కారు గురించి తెలిసిన తర్వాత మాత్రం గిన్నిస్ బుక్ రికార్డ్ ఏంటి ఇంకే రికార్డైన కొట్టగలదు అని అనుకుంటూ ఉంటారు మీరు. ఇక ఇంతలా చెబుతున్నానంటే ఈ కారుకు ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది అనిపిస్తుంది కదా. అవును ఎవరూ ఊహించని రీతిలో సరికొత్త స్పెషాలిటీ కలిగి ఉంది ఈ కారు. సాధారణంగా కారు ఏ సైజులో ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు. మహా అయితే పది అడుగులు అంతకుమించి 12 అడుగుల పొడవు ఉంటుంది కారు.
కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే కారు మాత్రం పది అడుగులు, 12 అడుగులు కాదు ఏకంగా వంద అడుగుల పొడవు ఉంది. వామ్మో వంద అడుగుల పొడవైన కారా.. అలా అయితే గిన్నిస్ రికార్డు కొట్టకుండా ఉంటుందా అని అనుకుంటున్నారు కదా. ఇక ప్రపంచంలోనే అత్యంత పొడవైన సరికొత్త హంగులతో వున్న కార్ గా గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఇక ఈ వంద అడుగుల పొడవున్న కారు తన రికార్డును తానే బద్దలు కొట్టింది. అమెరికా డ్రీమ్ అనే ఈ కార్ ను 1986లో జే ఓర్ బర్జ్ తయారు చేశారు అప్పుడది 60 అడుగుల పొడవుతో గిన్నీస్ రికార్డ్స్ లో చేరింది. 2019లో మైకేల్ దీన్ని కొనుగోలు చేశారు. కారు ప్రస్తుతం పొడవు 100 అడుగులు. ఇందులో హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్, హాట్ టబ్ లు కూడా ఉంటాయి.