హోలీ ఆడుతూ కత్తితో పొడుచుకున్నారు.. చివరికి?
అయితే ఇలా గుండెల్లో ఏకంగా నాలుగు సార్లు పొడుచుకున్న తర్వాత గాని అతను గాయం అయింది అన్న రియలైజ్ కాలేదు.. రక్తం కారుతుంటే చూసుకొని వెంటనే పక్కకు తప్పుకున్నాడు. ఇక వెంటనే గమనించిన బంధుమిత్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే యువకుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భాగాంగా ఏరియాలో వెలుగులోకి వచ్చింది. గోపాల్ సోలంకి అనే యువకుడు రాత్రి సమయంలో హోలీ వేడుకలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు.
ఈ క్రమంలోనే ఫుల్ గా సౌండ్ పెట్టుకొని చిందులు వేసాడు. ఇంతలో తన చేతిలోకి ఒక కత్తి తీసుకుని కొంత సేపు కత్తితో
సాంగ్ కి అనుగుణంగా కత్తితో స్టెప్పులు వేసాడు సదరు యువకుడు. చేతిలో కత్తి పట్టుకున్న అన్న విషయాన్ని మాత్రం మర్చిపోయాడు. గుండె పై చెయ్యి వేస్తూ పొడుచుకున్నాడు. ఇలా ఏకంగా నాలుగు సార్లు గుండె లో కత్తి దిగింది. నాలుగు సార్లు పొడుచుకునప్పటికే అతను కత్తితో గాయం చేసుకున్నాడనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు. ఇక మొత్తం రక్తం చిమ్మడం తో చేయి రక్తంతో నిండి పోయింది. వెంటనే గమనించినా మిత్రుడులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.