యువ ర్యాపర్ టాడ్ ఫాడ్ మృతి.. కారణం..?

Divya
గల్లీ బాయ్ సినిమాలో ర్యాపర్ గా నేర్పించిన ధర్మేష్ పర్మర్ ఈ రోజున మృతి చెందడం జరిగింది. అయితే ఈయన మృతికి గల కారణాలు ఇంకా ఇప్పటికి తెలియలేదు.ధర్మేష్ పర్మర్ అలియాస్ మెక్ టాడ్ ఫాడ్ గా నిన్న ప్రదర్శనలు చేయడం జరిగింది. ఇక ముంబైలో ఫేమస్ మ్యూజికల్ బ్యాండ్ అయినటువంటి వాటిలో ఎన్నో పాటలను పాడడం జరిగింది. ఇక వారి బృందం లోనే కొన్నేళ్ల పాటు కొన్ని పాటలు పాడుతూ వచ్చారు ధర్మేష్. ఇక దీంతో ఈయన మరణం పట్ల స్వదేశి చిత్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. ఇక సంగీతం మీద ఉన్న ప్రేమ తెలియాలి అంటే ఆయన చివరిగా పాడిన పాటను వింటే మనకి అర్థమవుతుంది.

సంగీతం మీద ఎక్కువ మక్కువ, ఫ్యాషన్ ఉండేదట. వాటన్నిటిని తన కళ్ళల్లో చూపించేవారని స్వదేశీ సంస్థ తెలుపుతోంది. ఇక గల్లీబాయ్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ధర్మేష్ మృతిపై కొంత మంది ప్రముఖులు సైతం, మరి కొంతమంది సినీ ప్రముఖులు సైతం సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక అందులో హీరో రణవీర్ సింగ్ కూడా తన సోషల్ మీడియా నుంచి హృదయం బద్దలైదంటూ ఒక ఎమోజిని షేర్ చేయడం జరిగింది.

హార్ట్ బ్రేక్ అయిన సింబల్ షేర్ చేసి దర్మేష్ ఫోటోను తన సోషల్ మీడియా నుంచి పోస్ట్ చేశాడు రణ్ వీర్ సింగ్. ఇక మరికొంత మంది ఈయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అతి చిన్న వయసులోనే ఇలా మరణించడంతో ఊహించుకోలేదని తెలియజేస్తున్నారు. తనని బ్రతికున్నప్పుడు కలిసినందుకు చాలా గర్వపడుతున్నాము.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని గల్లీ బాయ్ దర్శకుడు జోయా అక్తర్ పోస్టులు చేయడం జరిగింది. ఏది ఏమైనా అతి చిన్న వయసు లోనే ధర్మేష్ మృతిచెందడం తో ప్రతి ఒక్కరూ ఆయనపై ఎమోషనల్ పోస్ట్ చేస్తున్నా రు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: