వావ్: పంట రక్షణకు ఎలుగు బంటిని రంగంలోకి దించిన రైతు..!

MOHAN BABU
దేశంలో రైతు లేనిదే రాజ్యం లేదు అన్న మాట అక్షరాల సత్యం. ఏ ప్రభుత్వం వచ్చినా  రైతును రాజు చేస్తా అనడమే తప్ప రైతు ఎన్నటికీ రాజు అయింది లేదు. వీరు చేసింది లేదు. రైతు అంటేనే తన కష్టాన్ని తాను నమ్ముకొని ఇతరుల కడుపు నింపే కష్టజీవి.  పంట లాభం వచ్చినా నష్టం వచ్చినా తాను వ్యవసాయమే చేస్తాడు తప్ప మరో పని చేయడు. కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు ఆగిపోయాయి. కానీ రైతు తన పని ఆపితే మాత్రం ఈరోజు ఎవరు కూడా బ్రతికి ఉండే వారు కాదు. రైతన్న అనే కష్టజీవి నిర్విరామ శ్రమతో మనం ఆ మహమ్మారి విపత్తు సమయంలో ఇంట్లో ఉన్న మనకు ఆహారపదార్థాలను అందించిన రాజు రైతు.. ఆయన పంట పండించడం కోసం ఎలాంటి పనికైనా సిద్ధపడతాడు తప్ప  వెనకడుగు వేయడు.

 అలా ఒక రైతు కోతుల బారి నుంచి తన పంట రక్షించడం కోసం వినూత్న ఆలోచన చేశాడు. ఆరుగాలం పండించిన పంట కాపాడుకోవడానికి రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ ఉండవు. ఓవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టాలు జరిగితే, మరోవైపు జంతువుల దాడితో పంటనష్టం తప్పడంలేదు. దీంతో కోతులు మరియు అడవి పందుల బారి నుండి పంటలు రక్షించుకోవడానికి ఈ రైతు వినూత్న ఆలోచన చేశాడు. మరి ఆ రైతు ఎవరో ఎక్కడో తెలుసుకుందామా..? తెలంగాణ రాష్ట్రంలోని  సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగ సముద్రాల గ్రామానికి చెందిన రైతు భాస్కర్  వినూత్న ఆలోచన చేశాడు. తన పంటను రక్షించుకోవడానికి ఎలుగుబంటి ని రంగంలోకి దిగారు. అది ఎలుగుబంటి అంటే నిజమైన ఎలుగుబంటి కాదు. ఎలుగుబంటి వేషధారణలో ఉన్న ఒక వ్యక్తిని రంగంలోకి దింపి తన పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.


 గ్రామ శివారు లోని తనకు ఉన్నటువంటి భూమిలో మొక్కజొన్న పంట, బీర మరియు కాకర కాయ పంటలను వేసాడు. ఆ పంటలను కోతులు, అడవి పందులు ప్రతిరోజు వచ్చి నాశనం చేస్తుండడంతో అది గమనించిన రైతు వాటి బారి నుంచి కాపాడుకోవడానికి ఎలుగు బంటి వేషధారణ ఉపయోగించి ఒక వ్యక్తిని కూలి గా పెట్టి అతనికి రోజుకు 500 రూపాయలు చెల్లించి తన పంటను కాపాడుకుంటున్నారు. ఇది చూసినటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతు భాస్కర్ రెడ్డి ఆలోచన చాలా బాగుంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: