వైరల్ : స్కూల్ బస్సులో.. బీర్లు తాగిన ఆడపిల్లలు?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వారి తల్లిదండ్రులు వారిని ఎంతో శ్రద్ధగాచదువుకోవాలి అంటూ స్కూల్ కి పంపిస్తున్నారు. కానీ ఆవిద్యార్థులు మాత్రం పెడదోవ పట్టారు. చదువుకోవడం మానేసి చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోయారు. ఎంతలా అంటే ఏకంగా స్కూల్ బస్సులోనే బీర్లు తాగేంతలా చెడిపోయారు. వామ్మో విద్యార్థులు ఇంతలా చెడిపోయారు అని అనుకుంటున్నారు కదా.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే ఇలా స్కూల్ బస్సులో బీర్లు తాగింది మగ పిల్లలు కాదు ఏకంగా ఆడపిల్లలు.
ఈ ఘటన తమిళనాడులోని ఓ పాఠశాల బస్సులో వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని బస్సు లో మద్యం సేవిస్తూ ఉండగా ఆమె తాగుతున్నప్పుడు తోటి విద్యార్థులు వీడియో తీసారూ. ఇక ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియోలో విద్యార్థి నీతో పాటు మరికొంత మంది విద్యార్థునులు కూడా బీర్ బాటిల్ ఓపెన్ చేసి మద్యం తాగుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. స్కూల్ బస్సు లో మద్యం తాగుతున్న విద్యార్థులు అందరూ కూడా చంగాల్పట్టు లోని ఒక పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అన్న విషయం తేలింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర విద్యా శాఖ విచారణకు ఆదేశించడం గమనార్హం.