వైరల్ వీడియో.. క్షణాల్లో ప్రాణం పోయేది?
దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. సాధారణంగా పసివాళ్ళు ఇక సైకిల్ తొక్కడం వంటివి చేస్తూ ఉంటారు. రోడ్డుపై వేగంగా సైకిల్ తోక్కుతుంటే కొన్ని కొన్ని సార్లు అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురవుతూ ఉంటారు. ఇక్కడ ఒక పసి వాడు వేగంగా సైకిల్ తొక్కుకుంటూ మెయిన్ రోడ్ వరకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే సైకిల్ అదుపు తప్పడంతో కంట్రోల్ చేయలేకపోయాడు. అటు వైపు వేగంగా వస్తున్న ఒక ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో.. ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా వెనకనుంచి బస్సు వస్తుంది. అయితే చిన్నారి వాడిన సైకిల్ బస్సు చక్రాల కింద పడిపోగా ఇక చిన్నారి కొద్దిలో బస్సు చక్రాల కింద పడకుండా తప్పించుకోగలిగాడు.
ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. అదృష్టం బాగుంది కాబట్టి ఆ చిన్నారి బతికింది లేదంటే ప్రాణాలు పోయేవి అంటూ ఎంతో మంది కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ పోలీసులు ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన కేరళ కర్నూలు జిల్లా తాళిపారంభ కు సమీపంలోని షోరూమ్ వద్ద చోటుచేసుకుంది అని తెలుస్తోంది. ఇక తొమ్మిదేళ్ల పసివాడు చివరికి ప్రాణాలతో బయట పడినట్లు తెలుస్తోంది. ఇక సిసి టివి ఫుటేజ్ చూసిన తర్వాత తల్లిదండ్రులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు..