Viral Video : సూపర్ క్యాట్.. చూస్తే ఫీజులు ఔట్!

Purushottham Vinay
ఇక ఈ సోషల్ మీడియా ప్రపంచంలో జంతువులకు సంబంధించిన  అనేక వీడియోలు ఇంకా అలాగే ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు కూడా ఫన్నీ వీడియోలు ఇంకా అలాగే ఫోటోలు ఉంటాయి.అయితే తాజాగా ఓ పిల్లికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది. సాధారణంగానే.. నేలపై తలకిందులుగా నడిచే మనుషులను ఇంకా అలాగే జంతువులను చూశాం. రకరకాల స్టంట్స్ వేసే సీన్స్ చూశాం. కానీ మొత్తానికి మొత్తం మెట్లను అపోజిట్ డైరెక్షన్‌లో ఎక్కడం మీరు ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. సాధారణంగా పిల్లులు చెట్ల మీదకు ఇంకా అలాగే గోడల మీదకు దూకుతుంటాయి. ఒక్కోసారి గోడలు ఎక్కడం వంటివి కూడా అవి చేస్తాయి. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఈ పిల్లి మాత్రం చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. ఇక అది నడిచిన విధానం చూస్తే దానికేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా? అని మీకు అనిపించక మానదు.




ఎవరైనా ఇంట్లోని పై రూమ్‌కి వెళ్లాలంటే ఎలా వెళతారు మెట్ల మార్గం ద్వారా వెళతారు. అది కూడా స్ట్రెయిట్ డైరెక్షన్‌లోనే స్టెప్స్ ఎక్కుతూ వెళతారు. కానీ, ఇక్కడ ఓ పిల్లి మాత్రం చాలా డిఫరెంట్ గా స్టెప్స్ ఎక్కింది. మెట్ల కింది నుంచి అంటే రివర్స్ యాంగిల్ లో ఎక్కింది.ఇక దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు చక్కర్లు కొడుతూ బాగా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోని చూసి నెటిజన్లు తెగ షాక్ అవుతున్నారు. ఇదేంటి ఇలా వెళుతోందని అని వారు షాక్ అవుతున్నారు. ఈ పిల్లికి న్యూటన్ కనిపెట్టిన గ్రావిటీ పవర్ వర్తించదా ఏంటి? అని అందరూ షాక్ అవుతున్నారు. ఇదేదో తేడాగా ఉంది.. దీనికేమైనా స్పెషల్ పవర్స్ ఉన్నాయేమో అని కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ షాకింగ్ వీడియోకు ఇప్పటి వరకు కూడా 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు దీనిని చాలా విపరీతంగా లైక్ చేస్తున్నారు. తమదైన స్టైల్ లో అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: