విద్యార్థులతో కలిసి.. డాన్స్ ఇరగదీసిన కలెక్టర్?

praveen
ప్రతి ఒక్కరికి కాలేజీ రోజులు ఎంతో మధురం జ్ఞాపకాలను మిగిల్చుతూ ఉంటాయి. స్నేహితులతో ఇష్టం వచ్చిన చోట కి వెళ్లడం ఇక ఎలాంటి రూల్స్ లేకుండా ఎంజాయ్ చేయడం చేస్తూ ఉంటారు కాలేజీ విద్యార్థులు. అందుకే కాలేజీ రోజులు ఒక మరుపురాని జ్ఞాపకాలు అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ అందరికీ నచ్చేది అప్పుడప్పుడు కాలేజీలో జరిగే ఫంక్షన్స్. ఇక ఈ ఫంక్షన్స్ లో కాలేజీ విద్యార్థులు అందరూ కూడా తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తే మరి కొంతమంది అద్భుతమైన డాన్స్ లు చేస్తూ తెగ ఆనందంగా ఫీల్ అయి పోతూ ఉంటారు.

 ఇలా కాలేజీ లో ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు ఇలా విద్యార్థులు డాన్స్ చేయడం సర్వసాధారణం. అయితే ఫెస్టివల్ జరిగినప్పుడు ఒక స్పెషల్ గెస్ట్  లను అని పిలవడం లాంటివి చేస్తూ ఉంటారు కాలేజీ యాజమాన్యం.  స్పెషల్ గెస్ట్ గా వచ్చిన వారు విద్యార్థులతో కలిసి కాలు కదిపి డాన్స్ చేస్తే ఇక ఆ ఫెస్టివల్ మరింత ప్రత్యేకంగా మారిపోతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఇలా ఎంతో మంది రాజకీయ నాయకులు పలు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు డాన్స్ లు చేసి అక్కడున్న వారందరినీ కూడా ఆనంద పరచడం లాంటివి చూశాము.. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి విద్యార్థులతో ఎంతో ఇష్టంగా డాన్స్ చేసింది.

 ఇలా ఐఏఎస్ కాలేజ్ విద్యార్థులతో కలిసి అదిరిపోయే డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కేరళలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పాతాళం తిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆఫ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పాఠశాల విద్యార్థులు అందరూ కూడా ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఇక ఈ ఫ్లాష్ మాబ్ లో పాల్గొని తమతోపాటు డాన్స్ చేయాలని విద్యార్థులు కలెక్టర్ కోరారు. విద్యార్థుల కోరిక మేరకు వారితో డాన్స్ చేయడానికి ఒప్పుకున్న ఆమె అదిరిపోయే స్టెప్పులు తో అదరగొట్టారు అనే చెప్పాలి. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు సైతం ఆశ్చర్యపోయారు..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: