10వ తరగతి విద్యార్థులకు హైఅలర్ట్ విధించిన తెలంగాణ సర్కార్..!!
ఇకపోతే పరీక్ష సమయాన్ని మరో అరగంట సేపు పెంచామని మొత్తం సిలబస్ లో కేవలం 70 శాతం లో ప్రశ్నలు ఉంటాయని అధికంగా కల్పిస్తున్నామని తెలిపారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలి అని అలాగే పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.. పల్లె ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి " మన ఊరు - మన బడి " మళ్ళీ ఏర్పాటు చేశామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాల రూపురేఖల్లో మార్పు కల్పించాలని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా 8వ తరగతి వరకు ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడానికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఇంగ్లీష్ మాధ్యమాలలో పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి ఉపాధ్యాయులందరికీ, అవసరమైన శిక్షణను కూడా విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇకపోతే టెట్ పరీక్ష నిర్వహణలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. సిలబస్ పూర్తిగా తెలుసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది.