వైరల్ : వధూవరులకు.. ఏం గిఫ్ట్ ఇచ్చారో చూస్తే షాకే?
ఇక టమాట ధరలు పెరిగినప్పుడు కూడా ఇలాంటిదే చేశారు. ఇలా ఎప్పుడూ చిత్రవిచిత్రమైన గిఫ్టులు ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇక ఇది చూసిన తర్వాత జనాలు బాగా ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు అని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలు ఏ రేంజిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లెల్లో 12 గంటలు పట్టణాల్లో దాదాపు పది గంటల వరకు కరెంటు ఉండడం లేదు అని చెప్పాలి.
ఇలా కరెంటు కోతల కారణంగా అందరూ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇక ఇటీవల కరెంటు కోతలు ఉన్నాయి అని అందరికీ తెలియజేసేందుకు ఇక్కడ కొత్తగా ప్రయత్నించారు. వధూవరులిద్దరికీ కూడా విసినకర్ర లని గిఫ్ట్ గా ఇచ్చారు. కరెంటు కోతల నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో విసనకర్రలకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో శ్రీలంక జిల్లా సోంపేట లో జరిగిన పెళ్లికి వచ్చిన వరుడి స్నేహితులు దంపతులకు విసనకర్రలు బహుమతిగా ఇచ్చారు. ఎంతో అందంగా ప్యాక్ చేసిన బాక్స్ ఓపెన్ చేసి చూడగానే అందులో విసనకర్రలు ఉన్నాయి. ఇక ఇలా విసనకర్రలు బయటకు తీసుకోగానే ఇక విసురుతోంది అంటూ బంధువుల్లో ఒకరు అనడంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు..