వైరల్ : నడిరోడ్డుపై కొట్టుకున్న కాలేజీ అమ్మాయిలు?

praveen
ఒకప్పుడు ఆడపిల్ల వంట ఇంటికి మాత్రమే పరిమితం కావాలి అనే ఒక నానుడి ఉండేది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఇక ఇలాంటి రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ ఎంతో మంది ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పురుషులకు మేమేం తక్కువ కాదు అన్న విధంగానే అటు చదువులో ఎప్పుడూ ముందుంటారు. ఇక వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తూ  సత్తా చాటుతూ ఉన్నారు. ఇక ఉద్యోగాలు సాధించడంలో కూడా పురుషులకు మహిళల ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. ఇలా పురుషులతో సమానంగా మహిళా సాధికారత సాధించే దిశగా ప్రతి అడుగు వేస్తున్నారు మహిళలు. ఇక్కడ కొంతమంది యువతులు కూడా మేం పురుషులకు ఎక్కడ తక్కువ కాదు అని అనుకున్నారు.

 అయితే ఇలా పురుషులకు తక్కువ కాదు అనుకునీ ఏదో గొప్ప పని చేశారు అనుకోకండి.. ఏకంగా రోడ్డు మీదే దారుణంగా గొడవపడ్డారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కిందా మీదా పడుతూ కొట్టుకున్నారు.  ఇక ఇలా కొంతమంది యువతులు నడి రోడ్డుమీదే దారుణంగా కొట్టుకున్న ఒక వీడియో సంచలనం గా మారిపోయింది. సాధారణంగా ఇప్పటివరకూ ఎంతోమంది అబ్బాయిలు ఇలా రోడ్డుపై కొట్టుకోవడం అలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇక అబ్బాయిల ఎవరైనా ఇలా రోడ్డుపై కొట్టుకుంటే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అమ్మాయిలు ఇలా నడి రోడ్డు పై కొట్టుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలు నడిరోడ్డుపై కొట్టుకొని బీభత్సం సృష్టించిన వీడియో వైరల్ గా మారింది. ఒకే కళాశాలకు చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇక రోడ్డు పక్కనే నిలబడి మాట్లాడుకుంటున్న సమయంలో గొడవ మొదలైంది. దీంతో ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకోవడం మొదలు పెట్టారు. అంతేకాదండోయ్ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు వారిని విచిత్రంగా చూస్తున్న పట్టించుకోలేదు. ఇక అటువైపుగా వెళ్తున్న వాహనదారుడూ ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఇప్పటి వరకు తమ వద్దకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు అంటూ చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: