పెళ్లి మండపంలో పుషప్స్ చేసిన వధువు.. అందరూ షాక్?
కేవలం సంపన్నులు మాత్రమే కాదు సామాన్యులు సైతం తమ పెళ్లి అంగరంగవైభవంగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో మండపం లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో డ్యాన్సులు చేస్తూ ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలా వధువు వరుడు డాన్స్ చేసిన వీడియో లు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం వధువు కాస్త డిఫరెంట్ గా ట్రై చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
డీజే పాటల తో చిన్న పిల్లలు అందరూ డాన్స్ లతో ఉత్సాహం గా పెళ్లి మండపం మొత్తం మారి పోయింది. అంతా సందడి తో కళకళలాడుతున్న సమయంలో వధువు ఎంట్రీ ఇచ్చింది. ఇంతలోనే అందరికీ నమస్కారం చేసి నేలపై పుషప్స్ చేసింది. ఇక ఫిట్నెస్ పై తనకున్న ఇష్టాన్ని పెళ్లి మండపంలోనే చాటుకుంది. హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. పెళ్లి దుస్తులు ధరించి భారీగా నగలు ధరించి వధువు పుషప్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతుంది.. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఏదేమైనా ఇటీవల కాలంలో పెళ్లి చేసుకునె నూతన వధూవరులు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.