ఇక ఐపీఎల్ 2022 సీజన్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శనివారం నాడు
ఢిల్లీ క్యాపిటల్స్‌తో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరిగింది.ఇక ఈ మ్యాచ్‌లో బెంగళూరు మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ అయితే పెద్ద హైలైట్‌గా నిలిచింది. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే ఔట్ అయినా కానీ ఫీల్డింగ్‌లో మాత్రం కేక పెట్టించాడు. కళ్లు చెదిరే తన క్యాచ్‌తో మ్యాచ్‌ను ఓ మలుపు తిప్పాడు కోహ్లీ. అతని సూపర్ క్యాచ్‌కు దూకుడుగా ఆడుతున్న
రిషబ్ పంత్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా
ఢిల్లీ పై ఆర్సీబీ 16 పరుగుల తేడాతో మంచి విజయం సాధించింది. అంతేకాదు,
విరాట్ కోహ్లి క్యాచ్‌కి సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు ఇక 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో
ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లు కంప్లీట్ అయ్యే సమయానికి 134/5తో నిలిచింది. మ్యాచ్ ఎంతో ఆసక్తిగా సాగుతున్న వేళ..ఇక 17వ ఓవర్ ని వేయడానికి
మొహమ్మద్ సిరాజ్ వచ్చాడు. అప్పటికి రిషభ్
పంత్ టోటల్ గా 17 బంతుల్లో 34 పరుగులను చేశాడు. ఇక
పంత్ దూకుడు చూస్తే
ఢిల్లీ లక్ష్యం దిశగా వెళ్తున్నట్లే కనిపించింది.
దీంతో బెంగళూరు టీమ్‌లో కంగారు అనేది కనిపించింది.ఒత్తిడికి గురైన సిరాజ్ మూడో బాల్ ని లో ఫుల్ టాస్ రూపంలో విసరగా..
రిషబ్ పంత్ కవర్స్ దిశగా
విరాట్ కోహ్లీ తలపై నుంచి బౌండరీ కోసం బాల్ హిట్ చేశాడు. గంటకి 137కిమీ వేగంతో వచ్చిన ఆ బాల్ ని
రిషబ్ పంత్ చక్కగా కనెక్ట్ చేయడంతో..విరాట్
కోహ్లీ తలపై నుంచి బంతి బౌండరీకి వెళ్లేలా కనిపించింది.కానీ,
కోహ్లీ క్షణకాలంలో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో నమ్మశక్యంకాని రీతిలో ఆ బాల్ ని క్యాచ్ అందుకున్నాడు. దీంతో
రిషబ్ పంత్ దెబ్బకు బిత్తరపోయి ఎంతో నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు.విరాట్
కోహ్లీ మాత్రం ఆ క్యాచ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. స్టేడియంలోని గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ని చూస్తున్న
అనుష్క శర్మ వైపు
విక్టరీ సింబల్ చూపిస్తూ
విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.