ఓరి నాయనో.. మైనర్ బాలికకు స్టీరింగ్ అప్పజెప్పిన డ్రైవర్.. చివరికి?
ప్రయాణికులతో బస్సు నిండుగా ఉన్న సమయంలో ఒక మైనర్ బాలిక బస్సు నడుపుతాను అంటూ డ్రైవర్కు చెప్పింది. దీంతో ఇక డ్రైవింగ్ సీట్లో బాలికను కూర్చోబెట్టిన డ్రైవర్ ఆమెకు స్టీరింగ్ అప్పజెప్పాడు. అయితే ఇలా మైనర్ బాలిక బస్సు నడపడంనీ తోటి ప్రయాణికులు ఫోన్ లో రికార్డు చేయడం గమనార్హం. ఉదంపూర్- లాండర్ మార్గంలో బస్సు నడిపింది బాలిక. ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్ పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇలా బస్సు నడపడం గమనార్హం. బాలిక పక్కనే కూర్చుని డ్రైవర్ బాలికకు బస్సు నడపడం లో సూచనలు ఇస్తూ ఉండడం కూడా వీడియోలో కనిపిస్తూ ఉంది.
అంతేకాదండోయ్ ఇక ఆ బాలిక డ్రైవింగ్ చేస్తున్న సమయంలో బస్సు కొండ ప్రాంతంలో ఉన్న రహదారిపై వెళ్తూ ఉండటం గమనార్హం. రహదారి ఎంతో ప్రమాదకరం అని చెబుతూ ఉంటారు. ఇక ప్రయాణికులు అందరూ కూడా ఇది గమనించి బస్సు డ్రైవర్ పై సీరియస్ కావడంతో వెంటనే బాలిక చేతుల్లో నుంచి స్టీరింగ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. అయితే ఇక డ్రైవర్ ఇలా చేయడంపై ప్రయాణికులు అందరూ చెడామడా తిట్టారు. బస్సు కొండ ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారూ ప్రయాణికులు. వెంటనే ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..