వామ్మో.. పెళ్లి లో లేడీ డాన్సర్.. యువకుడు తుపాకీ ఎక్కడ పెట్టాడో తెలుసా?

praveen
సాధారణంగా పెళ్లి జరుగుతుంది అంటే హడావిడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  డీజే పాటలు తీన్మార్ డాన్స్ లు ఇక ఇవన్నీ పెళ్లి లో తప్పక ఉండాల్సిందే  ఇవన్నీ లేకుండా నేటి రోజుల్లో పెళ్లిళ్లు జరగడం లేదు అని చెప్పాలి. కొన్ని రాష్ట్రాలలో అయితే పెళ్లి వేడుకలో తుపాకీలు లేడి డాన్సర్లు రచ్చ రచ్చ చేసే పోకిరి పోరగాల్లు కూడా ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు. ఇక బీహార్ లాంటి రాష్ట్రాల్లో కాస్త గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఎవరి చేతిలో చూసినా తుపాకీలు  దర్శనమిస్తూ వుంటాయి. ఇలా తుపాకులు చేతిలో పట్టుకొని డాన్సులు చేయడం లాంటి వీడియోలు ఎన్నో చూస్తూనే ఉంటాం.


 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. లేడీ డాన్సర్స్ అందరూ కూడా స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నారు. ఇంతలోనే  ఒక యువకుడు స్టేజి మీదికి వెళ్లాడు. చేతిలో తుపాకీ పట్టుకుని ట్రిగ్గర్ మీద వేలు కదిలిస్తూ డాన్స్ చేయడం అందరినీ షాక్ కి గురిచేసింది  బీహార్లోని గోపాల్ ఘంజ్ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. జాదో పూర్ రోడ్డులో పెళ్లి జరిగింది. అక్కడికి కృష్ణ కుమార్ అనే యువకుడు అతిథిగా వచ్చాడు. ఇక డిస్కో డాన్స్ ప్రోగ్రాం వేదికపై పిస్తోలు పట్టుకుని హల్చల్ చేశాడు.స్టేజ్ మీద డాన్స్ చేస్తున్న ఒక లేడీ డాన్సర్ కు ఏకంగా చాతి మీద నడుము భాగంలో తుపాకి గురి పెట్టి డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆ లేడీ డాన్సర్ తో పాటు కింద ఉన్న బంధువులు కూడా షాక్ అయ్యారు.


 కేవలం బొమ్మ తుపాకీ అనుకుని బంధువులు లైట్ తీసుకున్నారు కాని అది నిజమైంది అని తెలుసుకున్న లేడీ డాన్సర్   భయపడిపోయింది.ఇక పోకిరి గ్యాంగ్ ఇలా గన్స్ తో రచ్చ రచ్చ చేస్తూ ఉంటే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అక్కడున్న వారు. సాధారణంగా పెళ్ళిళ్ళలో మారణాయుధాలు ఉపయోగించడానికి పర్మిషన్ ఉండదు. ఇక తుపాకి గురి పెట్టిన యువకుడుకి గన్ పర్మిషన్ కూడా లేదు అన్నది తెలుస్తోంది.  మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ యువకుడే దీనికి సంబంధించిన వీడియోని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయడం గమనార్హం. ఇక ఈ ఘటనపై స్థానికులు అందరూ కూడా మండి పడుతూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: