మ్యాంగో మ్యాగీని ఎప్పుడైనా తిన్నారా?
వేసవిలో విరివిగా దొరికే మామిడి పండ్లు, జ్యూస్ లతో స్వీట్ మ్యాగీ చేశారు. అది చూడటానికి కాస్త వెరైటీగా ఉన్న కూడా జనాలు ఆ రుచి కోసం ఎగబడటం విశేషం.. అసలు ఆ మ్యాగి స్పెషల్ ఏంటో ఒకసారి చుద్దాము.. మ్యాంగో మ్యాగీ'. మీరు విన్నది నిజమే. మ్యాగీని ముప్పుతిప్పలు పెట్టి చేసిన ఈ వెరైటీ వంటకం గురించి మీరూ ఓ లుక్ వేసుకోండి.. ఆ వీడియోలో ముందుగా.. ఫ్రై చేసే పెనంపై ఓ మహిళ మ్యాగీ నూడుల్స్ ను వేసి, నీళ్లు పోసి మ్యాజిక్ మసాలా వేసింది..తర్వాత మాజా బాటిల్ ఓపెన్ చేసి కాస్త పోసింది.
వంటకమయ్యాక మామిడి ముక్కలను దానిపై చల్లి అందించింది. ఈ మ్యాం గో మ్యాగీ తయారీ వీడియో ను ఒకరు పోస్ట్ చేయగా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. 'ఆ లొకేషన్ ఎక్కడో చెప్పరా. ఆ వంటకం చేసిన వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఎవరైనా వెళ్తారు'అని, ఇంకేం దొరకలేదా తల్లి అంటూ, మీరు నరకానికి పొతారు అంటూ నోటికి వచ్చిన కామెంట్ల తో వీడియోను పాపులర్ చేశారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ అధ్బుతాన్ని మీరు ఒకపారి చూసేయండి.. జీవితం లో మ్యాగి అంటే దగ్గరకు కూడా పోరు..