ఒకే బోర్డుపై రెండు పాఠాలు.. కన్ఫ్యూజన్లో స్టూడెంట్స్?

praveen
ఇటీవలికాలంలో సరైన సదుపాయాలు లేక అటు విద్యార్థులు సరిగా చదువు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న విషయం తెలిసిందే. ఒకవైపు అటు ప్రైవేటు పాఠశాలలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తూ ఉంటే.. ప్రభుత్వ సంబంధిత పాఠశాలల్లో మాత్రం ఇంకా సరైన సదుపాయాలు లేక అటు విద్యార్థులు మరోవైపు ఉపాధ్యాయులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు సోషల్ మీడియా లోకి వచ్చి వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇప్పుడు ఇలాంటి ఒక ఘటన అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. అంతేకాదు ఇక ఆ పాఠశాల ఎంత దీనస్థితిలో ఉందో ఈ ఘటన చెప్పకనే చెబుతుంది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సాధారణంగా ఒక తరగతి గదిలో ఒక సబ్జెక్టుకు సంబంధించిన క్లాస్ జరుగుతుంది అని అందరికీ తెలుసు. ఇక ఆ సబ్జెక్టుకు సంబంధించిన పీరియడ్ పూర్తయిన తర్వాత మరొక సబ్జెక్ట్ చెప్పడానికి ఉపాధ్యాయులు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు ఏకంగా ఒకే తరగతి గదిలో ఒకే బోర్డు పైన రెండు క్లాసులు చెబుతున్నారు.

 దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారి పోయింది. బోర్డు పై ఒక వైపు హిందీ మరోవైపు ఉర్దూ పాఠాలు బోధిస్తున్నారు టీచర్లు. ఈ ఘటన బీహార్లోని కతిహార్ లో ఆదర్శ మాధ్యమిక పాఠశాలలో చోటుచేసుకుంది. ఇద్దరు టీచర్లు పాఠం చెబుతుంటే మరో టీచర్ పిల్లలు అల్లరి చేయకుండా కట్టడి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తరగతి గదిలో కూర్చున్న విద్యార్థులు ఏ పాఠాలు వినాలో తెలియక ఇబ్బంది పడిపోతున్నారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారి పోవడం తో వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ఇక ఆదర్శ మాధ్యమిక పాఠశాలలో వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: