లెస్బియన్ జంటను విడదీసిన కుటుంబం.. కలిపిన కోర్టు..

Satvika
ఓ ప్రాంతంలో లెస్బియన్ జంటను తమ కుటుంబ సభ్యులు అది తప్పు అని బలవంతంగా విడదీసారు.సమాజం ఇలాంటి వాటిని ఒప్పుకోదు అంటూ ఇరు కుటుంబాల వాళ్ళు వాళ్ళను దూరం చేసే ప్రయత్నం చేశారు.కానీ వాళ్ళు ఒకరిని విడిచి మరొకరు ఉండలేక, విడిగా బ్రతలేక కోర్టు మెట్లు ఎక్కారు. ఈ కేసు పై పూర్తీ విచారణ జరిపిన కోర్టు తిరిగి వారిద్దని కలిపింది..ఈ అరుదైన ఘటన కేరళలో వెలుగు చూసింది.ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. కేరళకు చెందిన అదిల్లా నస్రీన్, ఫాతిమా నూరా అనే ఇద్దరు యువతులకు సౌదీ అరేబియాలో పరిచయం ఏర్పడింది.


ఆ పరిచయం కాస్త ఘాటు ప్రేమగా మారింది.అప్పట్నుంచి ఇద్దరూ కలిసే ఉండేవాళ్లు.ఇండియా వచ్చక కూడా కలిసే ఉన్నారు. అయితే, ఈ విషయం నచ్చని ఇరువురి కుటుంబ సభ్యులు వాళ్లను విడదీసేందుకు ప్రయత్నించారు. ఈ నెల 19న ఫాతిమా దగ్గరికి వచ్చింది అదిల్లా. ఇద్దరూ కలిసి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఒకే చోట ఉన్నారు. పోలీసుల సాయంతో వీళ్లు ఉన్న చోటును కనిపెట్టిన బంధువులు, కుటుంబ సభ్యులు ఇద్దరినీ తీసుకుని అలువా అనే సిటీకి తీసుకెళ్లారు. అక్కడికి వచ్చిన ఫాతిమా కుటుంబ సభ్యులు, ఆమెను తిరిగి కోజికోడ్ తీసుకెళ్లారు. దీంతో అదిల్లా అలువాలో, ఫాతిమా కోజికోడ్‌లో ఉండిపోయారు.

 
దీంతో తమను విడదీస్తున్నారని అదిల్లా పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేసింది. ఈ విషయంలో పోలీసులు సరిగ్గా స్పందించలేదని అదిల్లా ఆరోపించింది. ఆ మాటల పై పోలీసులు స్పందించారు.ఫాతిమా తన ఇష్టంతోనే పేరెంట్స్‌తో వెళ్తున్నట్లు రాసిచ్చిందని తెలిపారు.అదిల్లా కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. తన సన్నిహితురాలు ఫాతిమాను కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్లారని అదిల్లా పిటిషన్‌లో పేర్కొంది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఫాతిమాను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ఆమె, అదిల్లాతోనే ఉండాలనుకుంటున్నట్లు చెప్పింది. దీనికి అంగీకరించిన కోర్టు వాళ్లిద్దరూ కలిసి ఉండేందుకు అనుమతించింది.చివరకు కోర్టు తీర్పు తో ఇద్దరు ఒకటైయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: