ఆడ సింహం కోసం.. మగ సింహాలు ఫైటింగ్.. వైరల్ వీడియో?
సాధారణంగా సింహం అడవికి రాజు అన్న విషయం తెలిసిందే. అడవిలో ఉండే అతి క్రూరమైన జంతువు కూడా సింహమే కావడం గమనార్హం. పెద్ద పెద్ద జంతువును సైతం ఎంతో అలవోకగా వేటాడి తనకు ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది ఒకసారి సింహం గాండ్రించింది అంటే చాలు అన్ని జంతువుల వెన్నులో వణుకు పడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సింహాలు ఎప్పుడు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయనే విషయం తెలిసిందే. ఇటీవలే ఒక ఆడ సింహం కోసం మగ సింహాలు దారుణంగా పోట్లాడుకున్న ఒక వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆడ సింహం ఒక మగ సింహం కలిసి అడవిలో జత కట్టాయ్. అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాయ్. అయితే ఇక వీటిని దూరంగా మరో మగ సింహం గట్టిగా గాండ్రించింది. దీంతో మరో మగ సింహం కూడా కోపంతో గాండ్రించడం గమనార్హం. ఇలా ఇప్పటికే ఒక దానిపై మరొకటి భీకర రీతిలో దాడులు చేసుకున్నాయ్ అని చెప్పాలి. నువ్వానేనా అన్న రీతిలో ఈ పోరు సాగింది. ఇక ఈ రెండు సింహాలు కూడా అటు ఆడ సింహం కోసం పోరాడుతున్నాయి అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది..