పెళ్ళికి నో అన్నారని ఆత్మహత్య చేసుకున్న 75 ఏళ్ల తాత!

Purushottham Vinay
ప్రేమకు అసలు వయస్సుతో పనిలేదు.70 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి కూడా 35 ఏళ్ల యవతులని వివాహం ఆడడం ఈరోజుల్లో చాలా కామన్‌గా మారింది.సాధారణంగా గ్రామీణ భారతంలో 60 ఏళ్లు పైబడిన వారు వివాహం చేసుకోవడం అనేది అసలు చాలా అరుదు.చేసుకున్నా కూడా అసలు ఈ సమాజం అంగీకరించదు. కానీ కొన్ని జంటలు మాత్రం ఏమాత్రం అధైర్యపడకుండా వివాహం చేసుకుంటున్నారు. ఈ పెళ్లిళ్లు ఇప్పుడు హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి.ఇక తాజాగా 75 ఏళ్ల వ్యక్తి మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్దం కాగా, కుటుంబ సభ్యులు వద్దన్నారని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు భార్యలు ఇంకా ఆరుగురు పిల్లలతో సంసారం కలకలలాడుతున్నా కూడా, కానీ ఆయనకు మరో మహిళ మీద ప్రేమ కలిగింది. ఎలాగైనా ఆమెను మూడో పెళ్లి చేసుకోవాలని అతను తలంచాడు. ఇంట్లో చెప్పాడు. ఆయన ఇద్దరు భార్యలు పిల్లలు నో చెప్పారు. దీంతో తట్టుకోలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టిడి గుట్టకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి అబ్దుల్ రెహ్మాన్ వయసు వచ్చేసి 75 ఏళ్లు. ఆయనకు ఇద్దరు భార్యలు ఇంకా ఆరుగురు సంతానం.


ఇక ఆయన సంతానంలో ఇంకా ముగ్గురికి పెళ్లిళ్లు కాలేదు. వారి పెళ్లిళ్ల విషయం మరచిన ఆ పెద్ద మనిషి తన మూడో పెళ్లి గురించి ఆరాటపడ్డారు.ఇటీవల ఆ రెహ్మాన్ కు అక్కడ స్థానికంగా ఉంటున్న ఒక మహిళ పరిచయం అయింది. ఆమె మీద ప్రేమ కలిగింది. దీంతో ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆయన తలంచాడు. ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పాడు. వారంతా ముక్తకంఠంతో దాన్ని వ్యతిరేకించారు. అయినా కూడా రెహ్మాన్ పట్టువీడలేదు. దీంతో కుటుంబంలో గత కొంతకాలంగా అనేక గొడవలు జరిగాయి.ఇక రెహ్మన్ ఎంతగా చెప్పినా కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆసుపత్రికి తీసుకెళ్తే చికిత్స పొందుతూ అర్థరాత్రి తర్వాత అతను మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: