ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికి తెలిసిందే..వాటిని ఒకసారి వాడి పడేస్తారు.అయితే అవి మట్టిలో కలువవు.. పాలిమర్స్ ఎక్కువగా ఉండటం తో త్వరగా భూమిలో కలవవు..పర్యావరణానికి హానికరం చేస్తాయి..అందుకే ఆ ప్లాస్టిక్ వాడకాన్ని నిషెదించాలని ప్రభుత్వాలు గట్టిగా నిర్నయించాయి.దాంతో వచ్చే నెల 1 నుంచి ప్లాస్టిక్ వస్తువుల వినియోగం ను పూర్తిగా బ్యాన్ చేసే దిశగా ప్రణాలికలను ప్రభుత్వం సిద్దం చేస్తుంది..
ఇప్పటికే కొన్ని వస్తువులను లిస్ట్ లోంచి తీసేసారు.
యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ తో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతోంది. ఎక్కడ చూసినా వాడి పారేసిన ప్లాస్టిక్ కనిపిస్తుంటుంది. ఇది ఇలా వుండగా గుజరాత్ ప్రభుత్వం యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ పై వినూత్న నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి వినియోగానికి పనికొచ్చే ప్లాస్టిక్ ఉత్పత్తులపై జులై 1 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతంలో జూన్ 30న ప్రారంభమవుతున్న ఒక కేఫ్ గురించి చెప్పుకుని తీరాల్సిందే..
జేబులో చిల్లి గవ్వ లేకున్నా కూడా ఆ కెఫ్ లో ఏదైనా తినొచ్చు.. కడుపునిండా తాగొచ్చు..ఏంటీ ఫ్రీ అని అనుకుంటున్నారా? ఫ్రీ అయితే కాదు. కానీ డబ్బులు లేకపోయినా తినొచ్చు. ఎలాగంటే..పర్యావరణానికి తూట్లు పొడిచే ప్లాస్టిక్ చెత్తను తీసుకొచ్చి ఇస్తే చాలు. ఆ కేఫ్ లో అందుబాటులో ఉండేవి తినొచ్చు..తాగొచ్చు. ఇంట్లో వాడి పారేసిన ప్లాస్టిక్ చెత్త ఉంటే..వాటిని ఓ సంచిలో వేసుకుని జునాగఢ్ లోని ఈ కేఫ్ కు వెళ్ళాలి.
ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన సైతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేఫ్ లోని ఆహార పదార్థాల్లో సహజసిద్ధంగా పండించిన ముడి సరుకులను వినియోగిస్తారు. సర్వోదయ సాక్షి మండల్ ఈ కేఫ్ నిర్వహణను చూడనుంది. పర్యావరణంగా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన పట్టణంగా జునాగఢ్ ను తీర్చిదిద్దాలన్నది తమ ప్రయత్నమని అధికారులు చెబుతున్నారు..అర కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకెళ్లి ఇస్తే గ్లాసు నిమ్మరసం ఇస్తారు. కిలో చెత్తకు ఒక పోహ ఇస్తారు. ఈ రెస్టారెంట్ సమీకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఒక ఏజెన్సీని కూడా నియమించింది.