వైరల్ : మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్.. రెండు సింహాలను కంట్రోల్ చేసింది?
అయితే ఇలా టీవీలో సింహాలను చూసి అందరు భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం రెండు భారీ సింహాల ను కంట్రోల్ చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువు ఏది అంటే అందరూ సింహం అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి సింహం వేటాడాలి అని డిసైడ్ అయితే తప్పించుకోవడం ఇతర జంతువులకు అసాధ్యం అని చెప్పాలి. పెద్ద పెద్ద జంతువులు ని సైతం ఎంతో అలవోకగా వేటాడుతూ ఉంటుంది సింహం.
అలాంటి సింహాలని అదుపు చేసింది ఇక్కడ మహిళ. ఏకంగా ఆవులు గొర్రెలను కాస్తున్నట్లుగా ఎంతో అలవోకగా సింహాలకు కాపలా కాస్తుంది. రెండు సింహాలను అదుపు చేస్తూ వాటిని ఎక్కడికో తోలుకు పోతుంది. ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే ఒక మహిళ కర్ర చేతిలో పట్టుకొని అడవి మార్గంలో వెళ్తుంది. అయితే ఆ మహిళ ముందు ఒక సింహం కనిపిస్తుండగా.. కాసేపటికి మరో సింహం దర్శనమిస్తుంది. ఈ రెండు సింహాలు కూడా వెనుక కర్ర పట్టుకుని వస్తూ ఉంటే ఎంతో సైలెంట్‌గా ముందుకు వెళుతూ ఉన్నాయి రెండు సింహాలు. ఈ వీడియో చూసిన తర్వాత ఆ మహిళకు అంత ధైర్యం ఎలా వచ్చిందో అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.