టైగర్ కు గ్రీన్ సిగ్నల్.. వావ్ అంటున్న నెటిజన్లు?

praveen
సాధారణంగా ఎవరైనా వీఐపీలు వచ్చారు అంటే చాలా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సామాన్య ప్రజలందరి వాహనాలను కూడా నిలిపివేయడం చేస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇలాంటివి సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా అర్ధాంతరంగా ట్రాఫిక్ నిలిపివేసిన సమయంలో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే మరి కొన్నిసార్లు ఎంతోమంది వాహనదారులు స్వచ్ఛందంగా ట్రాఫిక్ ఆంక్షలు పాటించి అంబులెన్స్ కి దారి ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.

 అయితే ఇక్కడ కూడా రోడ్డుకి రెండు వైపుల నుంచి వస్తున్న వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయారూ. ఈ క్రమంలోనే ఎటూ కదలకుండా దారి ఇచ్చారు. ఇంతకీ వాహనదారులు అందరూ ఇలా వాహనాలను ఆపి దారి ఇచ్చింది ఎవరికో తెలుసా.. అడివిలో జీవించే పులికి. అవును మీరు విన్నది నిజమే. అడవిలో నుంచి ఎన్నో రహదారులు వెళ్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే  అడవుల్లో జీవించే  ఎన్నో జంతువులు రహదారిని  దాటుతున్న సమయంలో రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోవడం లాంటివి ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి.

 ఇక్కడ ఒక పులి రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే వాహనదారులు అందరూ కూడా తమ వాహనాలను నిలిపివేసి పులి కి దారి ఇచ్చారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వాహనదారులను నిలిపివేసి పులి ఎంతో హాయిగా రోడ్డు దాటేందుకు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని అటవీశాఖ అధికారి ప్రవీణ్ కశ్యన్  ట్విట్టర్ లో షేర్ చేయడం తో వైరల్ గా మారిపోయిందని చెప్పాలి. గ్రీన్ సిగ్నల్ ఓన్లీ ఫర్ టైగర్ అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: