దొంగతనం అనుమానం.. 9 ఏళ్ల బాలుడిని ఎలా కొట్టారో చూడండి?
అయితే 9 ఏళ్ళ బాలుడిని దారుణంగా చితకబాదడానికి కారణం అతను దొంగతనం చేశాడు అన్న అనుమానమే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. నివాస ప్రాంతం లోని ఒక వీధిలో బైకులపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలుడిని క్రూరంగా చితకబాదారు. ఇక ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది అని చెప్పాలి. ఆ బాలుడి పై దాడికి పాల్పడిన వారిలో స్పెషల్ ఆర్మూడ్ ఫోర్స్ ఆరో బెటాలియన్‌కు చెందిన అశోక్ తప్పా అనే కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పాలి.
ఇద్దరు వ్యక్తులు బైక్‌లపై వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ ఆడుకుంటున్న బాలుడిని పట్టుకున్నారు. కాగా తెల్ల చొక్కా ధరించి ఉన్న వ్యక్తి దారుణంగా పిల్లాడిని కొట్టాడు. కాలితో తన్నాడు. ఇక ఆ తర్వాత మరో వ్యక్తి పిల్లాడిని జుట్టు పట్టుకుని కనికరం లేకుండా పిడిగుద్దులు కురిపించాడూ. అయితే ఆ బాలుడు ని ఎందుకు కొడుతున్నారు అని మరో వ్యక్తి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. అక్కడికి వచ్చిన ఓ మహిళ వారిని ఆపడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమెను పట్టించుకోకుండా బాలుడిని తీవ్రంగా కొట్టి బైక్‌పై ఎక్కించుకుని వెళ్లారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.