కొండచిలువను మింగిన నాగుపాము.. వైరల్ వీడియో?

praveen
నాగుపాము.. ఈ పేరు చెబితే చాలు ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతుంది. ఇక వెళ్లేదారిలో ఎక్కడైనా పాము కనిపించింది అంటే చాలు గుండె జారి పోయినంత పని అవుతుంది.. అంతేకాదండోయ్ ఇక పాము మన వైపే వస్తుంది అంటే చాలు అక్కడినుంచి పరుగో పరుగు అంటారు అందరు. అయితే ఇలా నేరుగా నాగుపామును చూడటానికి భయపడిన వారు డిస్కవరీ ఛానల్ లో మాత్రం పాములు కనిపిస్తూ ఉంటే ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. పాము కదలికలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగుపాము ఎలాంటి సమయంలో ఎలా వ్యవహరిస్తూ ఉంటుంది ఆ విషయాన్ని తెలిపే ఇలా ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కాగా ఇలాంటి వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 అయితే సాధారణంగా నాగుపాములు వాటికంటే ఎక్కువ పరిమాణం ఉన్న జీవులను కూడా ఎంతో అలవోకగా మింగగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇలా మింగటం అయితే ఎంతో అలవోకగా చేస్తాయి కానీ వాటిని కడుపులో పెట్టుకుని అటూ ఇటూ కదలడానికి మాత్రం ఎంతో ఇబ్బంది పడి పోతూ ఉంటాయి. ఇక ఇలాంటివి ఎన్నో సార్లు నాగుపాముల విషయంలో జరిగింది. ఇప్పుడు కూడా ఇలానే జరిగింది. సాధారణంగా అయితే కొండచిలువ మిగితా పాములను మింగేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక నాగు పాము కొండచిలువను మింగేసింది.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఒడిశాలో ఈ ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. అటవీ ప్రాంతానికి సమీప గ్రామంలో ఒక ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించింది. అదే సమయంలో ఒక పెద్ద నాగుపాము కూడా అక్కడికి వచ్చింది. దీంతో రెండు పాములు పోట్లాడుకున్నాయి. ఈ క్రమంలోనే కొండచిలువను నాగుపాము అమాంతం మింగేసింది. ఇది చూసిన స్థానికులు అవాక్కయ్యారు. చూస్తుండగానే కొండచిలువ మింగేసిన నాగుపాము ఆ తర్వాత బయటకు కక్కేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: