వైరల్ : బట్టలు ఉతుకుతున్న కోతి.. చూస్తే నవ్వాగదు?
ఇలాంటి దాదాపు ఎవరూ చూసి ఉండరు కూడా. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఏకంగా ఒక కోతి మనిషి లాగానే ఒకచోట కూర్చుని బట్టలు ఉతుకుతుంది. అయితే ఈ వీడియో చూసి కొంతమంది ఆశ్చర్యపోతుంటే మరికొంతమంది మాత్రం పగలబడి నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో చూసుకుంటే దోబీ ఘాట్ వద్ద కూర్చుని ఉంది ఒక కోతి.
ఈ క్రమంలోనే మనిషి లాగానే కొన్ని బట్టలను తీసుకుని డిటర్జెంట్ పెట్టి బ్రష్ తో రుద్ది ఆ తర్వాత వాటిని చేతులతో నలుస్తూ బట్టలు ఉతుకుతుంది. నిజంగా మనుషులు ఎలాగైతే బట్టలు ఉతుకుతూ ఉంటారో అదే ప్రాసెస్ ని ఫాలో అయింది అని చెప్పాలి. ఇక బట్టలు ఉతికిన తర్వాత పక్కనే ఉన్న నీటిలో ముంచి వాటిని మళ్లీ శుభ్రం చేసింది. కాగా 36 సెకండ్ల నిడివిగల ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఇది చూసిన తర్వాత కోతుల నుంచి మనుషులు పుట్టారు అని ఊరికే అంటారా అని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. ఇంకొంతమంది అది ఒక హౌస్ వైఫ్ కోతి అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.