వైరల్ : ఆఫీసర్లా వచ్చి.. పాపను ఎత్తుకెళ్లాడు?
సీసీ కెమెరాలు ఉన్నాయన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. తాము చేయాలనుకున్న నేరాన్ని యదేచ్చగా చేస్తూ ఉన్నారు. ఇలాంటి వీడియోలు ఇటీవల ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సంచలనంగా మారిపోయింది. ఏకంగా తల్లి చెంత నిద్రిస్తున్న ఒక చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తర ప్రదేశ్లోని మధుర రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. ఆఫీసర్ అన్నట్లుగా ఇన్ షర్ట్ వేసుకొని ఫోజులు ఇస్తూ రైల్వే స్టేషన్కు వచ్చిన ఒక వ్యక్తి ప్లాట్ ఫామ్ పై తల్లి దగ్గర పడుకున్న ఏడు నెలల చిన్నారి ని అపహరించాడు.
మొదట రైల్వే స్టేషన్కు వచ్చిన సదరు వ్యక్తి తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని అటు ఇటు తిరిగాడు. ఆ తర్వాత అతడి ప్లాట్ఫారం మీద పడుకున్న ఒక మహిళ దగ్గర ఏడు నెలల చిన్నారి పడుకోవడానికి గమనించాడు. దీంతో ఎవరికి అనుమానం రాకుండా చిన్నారి ని ఎత్తుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త రైల్వే పోలీసులు చూసి షాక్ అయ్యారు. వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.. పలు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాదు నిందితుడి ఫోటో ని విడుదల చేసి ఆచూకి ఎవరికైనా లభిస్తే వెంటనే చెప్పాలని పోలీసులు విజ్ఞప్తి చేయడం గమనార్హం.