Viral Video: కింగ్ కోబ్రాకే షాకిచ్చిన వ్యక్తి?

Purushottham Vinay
సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు బాగా చక్కర్లు కొడుతుంటాయి.ఎన్నో రకాల జంతువులు సింహం, చిరుత, ఏనుగు, మొసలి, కోతి, కుక్క, పిల్లి, గుర్రం, పాములకు సంబందించిన వీడియోలు నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో స్నేక్ షో ఇచ్చే ఓ వ్యక్తి (పాములను ఆడించే వ్యక్తి) 1000 కంటే ఎక్కువ నాగు పాములను పెంచుతున్నాడు. ఇందులో రకరకాల నాగు పాములు ఉన్నాయి. వాటంన్నింటిని అండర్ గ్రౌండ్‌లో పెంచుతుంటాడు. ఆ వ్యక్తి స్నేక్ షోను ఇచ్చే ప్రతిసారీ తన దగ్గర ఉన్న పాములలో కొత్త వాటిని ఎంచుకుంటాడు. ఈ క్రమంలోనే తన కొత్త ప్రదర్శన కోసం పామును ఎంచుకునేందుకు వాటి మధ్యలోకి వెళతాడు. 



ఏ పామును ఎంచుకోవాలని అతడు చూస్తుంటాడు.సదరు వ్యక్తి ఈ పామును ఎంచుకొవాలని ఆలోచిస్తుండగా.. అతని వెనుక ఒక పెద్ద కింగ్ కోబ్రా పడగ విప్పి కాటేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే సంచి మధ్యలో ఉండడంతో దాన్ని కాటేస్తుంది. వెనక్కి తిరిగిన ఆ వ్యక్తి కింగ్ కోబ్రా పడగపై తన చేతితో ఒక్కటిస్తాడు. దాంతో ఆ కింగ్ కోబ్రా అక్కడినుంచి వెళ్లిపోతుంది. ఆపై ఆ వ్యక్తి తనకు కావాల్సిన పామును పట్టుకుని పైకి ఎక్కుతాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నికో జోవనోవిక్ (Nico Jovanovic) యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పాతదే అయినా.. ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'కింగ్ కోబ్రా'కే బాస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: