పిల్లికి చుక్కలు చూపించిన పక్షులు.. ఏం జరిగిందంటే?

praveen
ఐక్యమత్యమే మహాబలం.. ఈ మాట ప్రతి ఒక్కరు ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు. ఒంటరిగా పోరాటం చేయడం కంటే ఐక్యమత్యంగా పోరాటం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అంటూ  చెబుతూ ఉంటారు. చెప్పడం కాదు ఎంతో మంది ఈ విషయం నిరూపించారు కూడా కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఇలాంటి ఐక్యమత్యం మనుషుల మధ్య ఎక్కడా కనిపించడంలేదు. కుళ్ళు కుతంత్రాలతో మనుషుల మనసులు నిండిపోయిన నేపథ్యంలో పైకి నవ్వుతూ మాట్లాడుతున్న లోలోపల మాత్రం చెడుగానే ఆలోచిస్తున్న పరిస్థితిల్లొ ఐక్యమత్యం అనేది కనిపించటం లేదు.


 అయితే ఐక్యమత్యమే మహాబలం అన్నది అక్షరాల నిజం అన్న దానికి నిదర్శనంగా ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో ఉంది అని చెప్పాలి. సాధారణంగా ఈ ప్రకృతిలో ప్రతి జంతువు కూడా ఆహారం కోసం వేట సాగిస్తూ ఉంటుంది. ఇక ఈ ఆహారం కోసం అన్వేషణలో భాగంగా ఇతర జంతువులను వేటాడటం కూడా ఒక భాగమే. ఈ క్రమంలోనే కొన్ని జంతువులు మరి కొన్ని జంతువులకు ఆహారంగా మారడానికి పుట్టాయేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే సింహాలు అడవి దున్నలను వేటాడుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు అడవి దున్నలు ఐక్యమత్యంగా ఒక గ్రూపుగా ఏర్పడి సింహాలను భయపెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయ్.


 ఇప్పుడు పక్షులు ఐకమత్యాన్ని ప్రదర్శించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా పిల్లులు పక్షులను వేటాడటం జరుగుతూ ఉంటుంది.  ఇక్కడ ఒక పిల్లి పక్షులను వేటాడటానికి ప్రయత్నించింది. కానీ పక్షులు మొత్తం ఐక్యమత్యంగా ఆ పిల్లి పై దాడి చేయడం ఈ వీడియోలో చూడవచ్చు.  వీడియో సోషల్ మీడియా  వేదికగా తెగ హల్చల్ చేస్తోంది అని చెప్పాలి. పిల్లి ఎగిరి పక్షిని నోట్లో పట్టుకుంటుంది. ఇంతలో ఇక స్నేహితులని  పిల్లిపై దాడి చేయడం ప్రారంభించాయ్. దీంతో భయపడిపోయిన పిల్లి పక్షి ని వదిలి పారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cat

సంబంధిత వార్తలు: