వైరల్ : ఇంత దారుణమా.. పెంపుడు కుక్కను నేలకేసి కొట్టిన మహిళ?
అందరూ చూస్తుండగానే కుక్క పిల్లని రోడ్డు మీద దారుణంగా చావ కొట్టింది సదరు మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ వీడియో చూసిన ఎంతోమంది జంతు ప్రేమికులు అల్లాడిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అభం శుభం తెలియని మూగజీవాల పట్ల ఇంత కర్కశంగా ప్రవర్తించడం ఏంటి అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో చూసుకుంటే ఓ మహిళ తన పెంపుడు కుక్కను వెంట తీసుకొని వచ్చింది.
జనాలు ఎక్కువగా ఉండడం తో ఆ కుక్క అరవడం మొదలు పెట్టింది. అరవకు అని ఆ మహిళ కుక్కను హెచ్చరించిన అని అరవడం ఆపలేదు. దీంతో కోపం తో ఊగి పోయింది. మొదట కేవలం కుక్కతో మాట్లాడుతున్నట్లుగా ప్రవర్తించిన సదరు మహిళ అంతలోనే విచక్షణ కోల్పోయింది. దీంతో ఆ కుక్కను తీసుకొని నేలకేసి కొట్టింది. ఇదంతా చూస్తున్న వారు ఒక్క సారిగా అవాక్కయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. తర్వాత ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సదరు మహిళ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.