Viral: పెళ్ళై 8 ఏళ్ళయిన సెక్స్ చేయని భర్త?

Purushottham Vinay
ఓ జంటకు పెళ్లై ఏకంగా 8 సంవత్సరాలు గడిచాయి. 8 సంవత్సరాలు అంటే తక్కువే కదా. మరి ఏకంగా అనే పదం ఎందుకు వాడారు అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలిస్తే వామ్మో నిజమా అనుకుంటారు. 8 సంవత్సరాలు అయినా ఆ భర్త ఒక్కసారి కూడా భార్యకు శారీరకంగా దగ్గరకాలేదు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన భార్య నిలదీయగా తనకు జరిగిన ఓ ప్రమాదం కారణంగా సంసారానికి పనికిరానని తెలిపాడు.చిన్న సర్జరీ చేసుకుంటే సెట్‌ అవుతుందని చెప్పి.. కొన్ని రోజుల తర్వాత సర్జరీ చేసుకొని వచ్చాడు. అనంతరం భార్యతో కలవడం ప్రారంభించాడు. అయితే ఆ సర్జరీ ఏంటో తెలిసిన భార్య గుండె ఒక్కసారిగా బద్దలైంది. ఇంతకీ ఆ సర్జరీ ఏంటి.? ఆమెను అంతలా బాధకి గురి చేసిన ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ మహిళ భర్త 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో మూడేళ్ల పాటు ఒంటరిగా జీవించిన సదరు మహిళ 2014లో ఢిల్లీకి చెందిన విరాజ్‌ వర్దన్‌ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. పెళ్లైతే జరిగింది కానీ పెళ్లి జరిగిన నాటి నుంచి జంట శారీరకంగా మాత్రం కలవలేదు.



విరాజ్‌ భార్యను ఏదో ఒక కారణంతో దూరం పెడుతూ వచ్చాడు. అయితే ఒకానొక సమయంలో భార్య ఒత్తిడి పెంచగా.. రష్యాలో ఉన్న సమయంలో తనకు ప్రమాదం జరిగిందని అందుకే కలవలేకపోతున్నానని చెప్పాడు. చిన్న సర్జరీ చేసుకుంటే అంతా సెట్‌ అవుతుందని తెలిపాడు.ఈ నేపథ్యంలోనే 2020లో బరువు తగ్గే సర్జరీ ఉందంటూ కోల్‌కతా వెళ్లిన విరాజ్‌.. తిరిగి వచ్చాక భార్యతో శారీరకంగా కలవడం ప్రారంభించాడు. అయితే అతను కోల్‌కతా వెళ్లింది బరువు తగ్గడం కోసం కాదని.. పురుషుడి అవయవాల మార్పిడి కోసమని వైద్యుడి రిపోర్ట్‌ చూసిన భార్యకు తెలిసిపోయింది. ఢిల్లీకి చెందిన ఆ వ్యక్తి విరాజ్‌ కాదని విజైతా అనే యువతి అనే నిజం తెలిసి ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఒక అమ్మాయిని ఇన్నాళ్లు భర్తగా భావించిన ఆమె కాళ్ల కింద భూమి కంపించింది. విరాజ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై సదరు మహిళ కేసు పెట్టింది. దీంతో ఢిల్లీలో ఉన్న అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వడోదరకు తీసుకొచ్చి అనంతరం భార్య, భర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: