వార్నీ.. పియానో ఇలా కూడా వాయిస్తారా?
సాధారణంగా పియానో ఎలా వాయిస్తారు అందరికీ తెలిసిందే. ఇక అద్భుతంగా పియానో వాయించేవారు అటు శ్రూతులందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎంతోమంది పియానో వాయించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. కానీ కాస్త కొత్త ఏముందంటే ఇందులో అందరిలా కాకుండా కాస్త విచిత్రంగా కొత్తగా ట్రై చేసి పియానో వాయించింది ఓ బాలిక. సాధారణంగా ఒక కుర్చీపై కూర్చుని పియానో వాయించడం కాదు.. ఏకంగా బెంచ్ పై పడుకొని పియానో వాయిస్తుంది ఒక బాలిక.
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారిపోయింది. చైనాలోని జీయాన్ కి చెందిన షైన్ అనే బాలిక బెంచ్ పై పడుకొని తలపై నుంచి పియానో ప్లే చేస్తుంది. డాల్ అండ్ బేర్ డాన్సింగ్ పాటకు ఆమె ఎంతో కూల్ గా సరికొత్త పొజిషన్లో పియానో ప్లే చేస్తూ ఉంది. తనకు తొలిత పియానో ప్రాక్టీస్ చేయడం విసుగు అనిపించడంతో కాస్త వినోదాత్మక పద్ధతిలో పియానో వాయించడానికి ప్రయత్నించాను అంటూ చెప్పుకొచ్చింది సదరు బాలిక. ఇక ఇలా కాస్త కొత్తగా పియానో వాయించి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది.