వైరల్ : వాంగులో చిక్కుకున్న కారు.. భార్య భర్తలు ఎలా బయటపడ్డారో తెలుసా?
ఇక వరదల కారణం గా అటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు అని చెప్పాలి. ఇక అయితే ఇటీవల తెలంగాణ అంతట కుండ పోతా వర్షం కురిసింది. ఈ క్రమం లోనే వికారాబాద్ జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇలా వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న సమయంలో ఇక వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాలి. ఇకపోతే ఇటీవల జిల్లాలోని తరూరు మండలం నాగారం వద్ద వరద ఉధృతికి వాగులో కారు చిక్కుకుపోయింది. అయితే కారులో ప్రయాణికులు మాత్రం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడుకున్నారు.
తారూరు మండలం నాగారం గ్రామం వద్ద వాగులో శివ, లాస్య అనే దంపతులు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది అయితే అదృష్టవశాత్తు భార్యాభర్తలు ఇద్దరు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి చేద్దుకొమ్మను పట్టుకుని ప్రమాదం నుంచి బయటపడ్డారు. పండగ ముగించుకుని వికారాబాద్ వెళ్దామని శివ, లాస్య బయలుదేరారు. అలాంటి సమయంలోనే వారి కారు వాగులో చిక్కుకుపోయింది. ఇక ఇలా భార్యాభర్తలు ఇద్దరు కూడా వరదల్లో చిక్కుకుపోయి కారులోంచి బయటపడి చెట్టు కొమ్ముపై నిలబడగా అక్కడే ఉన్న స్థానికులు వారికి సహాయం చేసి రక్షించారు.