వైరల్ : బర్త్ డే రోజు తండ్రికి.. కొడుకు ఊహించని సర్ ప్రైస్?

praveen
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త వీడియోలు వైరల్ గా మారిపోతూనే ఉంటాయి అని చెప్పాలి. ఇలా ఇంటర్నెట్ లోకి వచ్చే కొన్ని వీడియోలు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు అందరిని భయపెడుతూ ఉంటాయి. మరికొన్ని వీడియోలు మాత్రం మానవ బంధాలను మరోసారి గుర్తు చేస్తూ మనసును హత్తుకునేలా ఉంటూ చివరికి భావోద్వేగానికి లోను చేస్తూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య ఉండే బంధానికి సంబంధించిన ఏదైనా వీడియో సోషల్ మీడియా లోకి వచ్చిందంటే చాలు అది ఎప్పుడూ టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్ గానే కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి..


 ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య ఎప్పుడూ బంధం ప్రత్యేకమైనది. ఎన్ని రోజులు గడిచినా ఎన్ని యుగాలు మారిపోయిన కూడా ఆ బంధంలో ఉన్న ఆప్యాయత అనురాగం గురించి మాటల్లో వర్ణించడం మాత్రం చాలా కష్టం. అయితే ఇటీవల కాలంలో తమ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని తల్లిదండ్రులు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తే సంతోష పడిపోతున్నారు. పిల్లల తమ దగ్గర లేరు అనే బాధ ఉన్నప్పటికీ ఇక మంచి ఉద్యోగం చేస్తున్నారూ అనే ఆనందంతో బ్రతికేస్తున్నారు తల్లిదండ్రులు.


 ఇక ఎప్పుడైనా విదేశాల నుంచి తమ పిల్లలు ఇంటికి వచ్చారంటే చాలు పట్టలేనంత ఆనందంతో ఉంటారు. అయితే ఇటీవల కొడుకు తన తండ్రికి బర్త్ డే రోజు ఊహించని సర్ ప్రైస్ ఇచ్చాడు. ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక వ్యక్తి తన పుట్టినరోజుని హోటల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలోనే విదేశాల్లో ఉన్న కొడుకు ఒకగిఫ్ట్ తీసుకొని వచ్చి వెంటనే తండ్రి ముందు ప్రత్యక్షమయ్యాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  తన కొడుకుని హత్తుకుని ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: